ఆ గ్రామానికి ఎల్లప్పుడూ ఊటే

ఆ గ్రామానికి ఎల్లప్పుడూ ఊటే
December 02 13:32 2017

అనంతపురం,

ఆ విలేజ్ లో ఎప్పుడూ నీళ్లు వరదై పారుతుంది.  పైప్ లైన్ లీకూ కాదు..వర్షపు నీరు కాదు. కారణం మాత్రం అధికారుల నిర్వాకమే. రిజర్వాయర్  డిజైన్ లోపంతో ఆ గ్రామ వీధుల్లోనూ…ఇళ్లలోనూ నీరు ఊటలా వస్తూనే ఉంటుంది. హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఓ రిజర్వాయర్ నిర్మించారు. అంతే అప్పటి నుంచి నీటి ఊటతోనే ఊరంతా నిండిపోతుంది. ఊట నీటిలోనే జీవనం సాగిస్తున్నాఆ విలేజ్ స్టోరీ ఓ సారి చూద్దాం. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం బేళుగుప్ప మండలం జీడిపల్లిలో నీటి ఊటతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీడిపల్లి ఒకప్పుడు కుగ్రామం. ఇక్కడ హంద్రీనీవా ప్రాజెక్ట్ లో భాగంగా రిజర్వాయర్ నిర్మించారు. నిర్మాణలోపమో, నాణ్యతా ప్రమాణాలు పాటించలేదో గ్రామమంతా ఊట పట్టింది. ఇక్కడ వీధుల్లోకి.. ఇళ్ళలోకి నీరు వస్తుంది. ఇదిగో… ఈ గ్రామంలో నీళ్లు పారుతున్నాయంటే… పైపులైన్ లీకు కాదు భూగర్భ జలాలు ఇలా ప్రవేశించే నీటి మధ్యలో జీవనం సాగిస్తుంటారు. ఇక్కడ రిజర్వాయర్ నిర్మించడానికి సహకరించిన జీడిపల్లి గ్రామస్థులకు ఇప్పుడు సమస్యగా మారింది. గ్రామస్తులు సహాకారం అందించడం వల్లే జిల్లాకు సాగునీరు అందుతుంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. దీంతో జలదిగ్బంధంలోనే జీవనం సాగిస్తున్నారు. ఇల్లు పునాదిలో నుంచి నీరు వస్తుండటంతో… ఇళ్లు కూలిపోయే అవకాశాలున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అప్పుడప్పుడు స్వల్పంగా భూకంపం, శబ్దాలతో భయబ్రాంతులకు గురవుతున్నారు గ్రామస్తులు. 1993లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జిల్లాకు సాగునీరు అందించాలని ఉద్దేశంతో  కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాజశేఖరరెడ్డి  2005లో  నిర్మాణ పనులకు చొరవ చూపారు. మూడేళ్లలో రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అప్పటి నుంచి కృష్ణా జలాలు రిజర్వాయర్ కు చేరుతుండడంతో జీడిపల్లి వాసులకు కష్టాలు మొదలయ్యాయి. తరవాత పాలకులు,అధికారులు పట్టించుకోలేదు.రిజర్వాయర్ కింద ఉన్న ముంపు ప్రాంతంలో ఉన్న జీడిపల్లి వాసులకి పునరావాసం కల్పించడంలో పాలకులు, అధికారులు నిర్లక్ష్యం చేస్తూండడంతో నీటి మడుగులో కొట్టుమిట్టాడుతూన్నగ్రామస్తులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10013
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author