కోటప్ప కొండపై కనిపించని కాకి

కోటప్ప కొండపై కనిపించని కాకి
December 02 13:34 2017
గుంటూరు,
కావ్‌…కావ్‌…..మంటూ కాకి వాలని  కొండ…ఎక్కడైనా… ఉంటుందా. ఉంది….కోటివేల్పుల…అండా..కోటప్పకొండ. ఆ కొండ పై…ఎప్పటికీ కాకి వాలదు. కోటప్పకొండ అంటే ఉభయ రాష్ర్టాల్లో తెలియని వారుండరు.. పుణ్యక్షేత్రంగా కోటప్పకొండ తెలుసుగానీ….కాకి వాలని కొండాగా ఎవరికీ తెలియదు. కాకి వాలని ఆ కొండ ఏమిటి..ఎందుకు వాలదు….ఆ పురాణ గాధ ఒక్కసారి తెలుసుకుందాం..గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలో కోటప్పకొండ ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇక్కడ త్రికోటేశ్వర స్వామి వారు పైన ఉన్న కొండ గృహలలో తపస్సు చేస్తూ వుండేవారు. కోటప్పకొండ దక్షిణాన కొండకావురు అనే గ్రామం ఉంది. ఆ గ్రామమునందు సునందుడు, కుందరి ఆనే దంపతులు వుండేవారు. వారు అక్కడే ఉన్న అడవిలో ఆవులు కాస్తూ వుండేవారు. ఒక ఆవు మాత్రం స్వామి వారు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వస్తూ వెళ్తూ ఉంటుంది. స్వామి వారి వద్దకు వెల్లి వచ్చిన ఆవు మాత్రం ఇంటి దగ్గర పాలు ఇచ్చెదికాదు అది గ్రహించిన సునందుడు, కుందరి దంపతులు ఎందువలన ఇలా జరుగుతుందని ఆ ఆవు కొండ పైకి స్వామి వారి వద్దకు వెల్లినప్పుడు వీరి ఇరువురు తన వెంట వెళ్లగా అక్కడ స్వామి వారికి పాలు ఇస్తుంది. అది చూసి ఆశ్చర్యపోతారు దంపతులు.  అప్పుడు వీరు స్వామి వారి వద్దకు వెల్లి మీరు చాలా మహిమలు కల వారు మీదగ్గరకి వచ్చి మా ఆవు పాలు ఇస్తుంది. అంటే మేము చాలా అదృష్టవంతులం మేము వున్నంత వరకు మేమే మీకు పాలు తెస్తాం స్వామి అని అక్కడనుంచి వెల్లిపోతారు.  ఆ దంపతులు సంతానకలగదు.  స్వామి వద్దకు వెల్లి మాకు సంతానం లేదు అని చెప్తారు. అప్పుడు స్వామీ వారు వారిని దివిస్తారు. అప్పుడు వారికి ఆనంద వల్లీ కి జన్మణిస్తారు ఆనందవల్లి జన్మించిన నాటి నుంచి ఆ గృహంలో సకలైశ్వర్యాలతో తులుతూగుతూ ఉండేది ఆనందవల్లి శివ భక్తు రాలై ఆటపాట లందు సహితం పరమేశ్వరుని మరువక ధ్యానిస్తూ మనసా వాచ కర్మణా శివ లీల విషశాలను తలచి మురిసి పొతు వస్త్ర భూషణ మాల్యాబరాలదు మనసు పోనియక విభూతి రుద్రాక్షమాలికల దరించి తోటి వారులకు ఆద్యాత్మికతత్వాన్ని ఉపదేశీస్తూఉండెదీ. కొంత కాలనికి ఆనందవల్లి తల్లీ దండ్రులు వయసు మీద పడటంతో కొండ మీదకు ఎక్కలేనిస్థితిలో అమ్మ మేము బతికి వునంతవరకు స్వామి వారికి పాలు ఇస్తామని మాట ఇచ్చాము అది నువ్వే తీర్చాలి అని చెప్పటంతో. అప్పుటి నుంచీ స్వామి వారికి పాలు తీసుకెళ్లి  ఇస్తూవుంది. ఒకరోజు స్వామి వారు అమ్మ నువ్వు పెళ్లి ఈడుకు కొచ్చావు నీవు ఇంకా ఇక్కడికి రావద్దు అని స్వామి చెప్తారు.  అప్పుడు ఆనందవల్లి లేదు స్వామి మా అమ్మ నాన్న కోరిక స్వామి ఇది వారికోసం నేను చేయాలిసిందే అని చెప్పి .. స్వామి వారి మాట వినకుండా తనపని తను చేస్తూ ఉండేది. అప్పుడు స్వామి ఇక్కడికి ఆనందవల్లి రాకుండా వుంటాడానికి కుత్రిమా గర్భం ఇస్తారు.. అయిన ఆమె పట్టు విడకుండా ప్రాణాలను లేక్క చేయకుండా రోజు పాలు ఇస్తూ ఉండేది ..ఒక రోజు స్వామి వారికి పాలు తిసుకెళ్తూ  ఉండగా  అలసిపోయి  ఒకచోట కూర్చుండి పోతుంది. చేతి  లో ఉన్న కలశంపై కాకు లు వాలి కలశంలో ఉన్న పాలు నెల పాలు కాగా కోపించి న ఆనందవల్లి ఈరోజు తొ ఈ కొండపైకి కాకు లు రా కూడదుగాక అని శపించను. అప్పుడు పైన ఉన్న శివుడు విని తదస్స్తూ అంటారు.ఈ శాప మహిమ నేటికీ నిదర్శనం గా కానవస్తుంది…..
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10016
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author