చిన్న చిన్న రిపేర్లతో పక్కన పడేస్తున్నారు

చిన్న చిన్న రిపేర్లతో పక్కన పడేస్తున్నారు
December 02 13:50 2017
ఏలూరు,
మాది కాదు మా అత్తారిదేగా పోతే పోనీ అన్న చందాన ఉంది అధికారుల తీరు. ప్రభుత్వ వాహానాల పట్ల అధికారులు అలాగే ఉంది. ఏసీ కార్లకు అలవాటుపడి లక్షల రూపాయలు విలువచేసే వాహనాలు చిన్న చిన్న రిపేర్ల  పేరుతో మూలకు గెంటేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని అనేక ప్రభుత్వ శాఖల వద్ద లక్షలాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ వాహనాలు మూలనపడి శిథిలావస్థకు చేరుతున్నాయి. చిన్న చిన్న రిపేర్లు వచ్చిన వాటిని అధికారుల నిర్లక్ష్యంతో మూలన పడవెయ్యటం వలన ఎండకు ఎండి, వానకు తడిచి చిన్న చిన్న రిపేర్లు పెద్ద రిపేర్లవుతున్నాయి. అలాగే వాహనాలు ఇనుముతో తయారు చేసినవి కావడంతో తుప్ప పట్టి పోతున్నాయి.ఈ విధంగా లక్షలాది రూపాయలు విలువ చేసే వాహనాలు ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. అధికారులు మాత్రం పాత వాహనాలను పక్కన పెట్టి… ఎక్కువ అద్దె చెల్లించి అందంగా ఉండే ఏసీ వాహనాలను ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల  నెలవారీ అధికారులకు చెల్లించే జీతాలే గాక అద్దె వాహనాలకు కూడా లక్షలాది రూపాయలు ప్రభుత్వ ధనం చెల్లించవలసి వస్తుంది. బాధ్యతగా ఉండావల్సిన అధికారులు ప్రభుత్వ ధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయడం పట్ల ప్రభుత్వ అధికారుల తీరుపై సాధారణ ప్రజలు సైతం మండి పడుతున్నారు. పాత వాహనాలను రిపేర్లు చేయించడంగానీ..లేదా వాటిని అమ్మి వాటి స్థానంలో కొత్తవాహనాలను ఉపయోగిస్తే బాగుంటుందని ఈ రకంగా కొంతవరకూ ప్రభుత్వ ధనాన్ని ఆదా చెయ్యవచ్చునని ప్రజలు అంటున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10022
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author