కాపుల రిజర్వేషన్ కు జస్టిస్ మంజూనాథ నో

కాపుల రిజర్వేషన్ కు జస్టిస్ మంజూనాథ నో
December 02 14:42 2017
అమరావతి,
కాపులకు రిజర్వేషన్ లు కల్పించడానికి జస్టిస్ మంజూనాద వ్యతిరేకించారు. అయితే కమిషన్ లోని ముగ్గురు సభ్యుల అబిప్రాయాల మేరకు ఈ రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ రిజర్వేషన్ లు రాజకీయ పదవులకు వర్తించబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్య, ఉద్యోగాలలో మాత్రమే రిజర్వేషన్లు వర్తించేలా తీర్మానం చేస్తూ కేంద్రానికి నివేదిక పంపుతారు.మీడియాలో వచ్చిన కధనం ప్రకారం జస్టిస్ కె.ఎల్.మంజునాథ్ నేతృత్వంలోని బీసీ కమిషన్లో ఆయనతో కలసి నలుగురు సభ్యులు ఉన్నారు. అందులో ముగ్గురు సభ్యులైన ఎం.పూర్ణచంద్రరావు, శ్రీమంతుల సత్యనారాయణ, వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం శుక్రవారం ముఖ్యమంత్రిని కలసి నివేదిక అందజేశారు. జస్టిస్ మంజునాథ్ తన నివేదిక ఇవ్వలేదు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ తాను సిఫార్సు చేయబోనని మంజునాథ్ స్పష్టం చేశారని, అందుకే నివేదిక ఇవ్వలేదని సమాచారం. కమిషన్ సభ్యులు ముఖ్యమంత్రిని కలసి నివేదిక ఇవ్వడం, మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం, బిల్లు తయారు చేయడం వంటి పరిణామాలన్నీ శుక్రవారం శరవేగంగా జరిగిపోయాయి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10059
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author