కేజీబీవీలను 12వ తరగతి వరకు నడపాలి

కేజీబీవీలను 12వ తరగతి వరకు నడపాలి
December 02 18:15 2017
భువనేశ్వర్,
బాలికల విద్య పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ అడ్వయిజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్(కేబ్) సబ్ కమిటీ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చైర్మన్ గా నేడు ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో సమావేశమైంది. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన వివిధ అంశాలపై చర్చించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు పదో తరగతి వరకు నడుస్తుండగా..వీటిని 12వ తరగతి వరకు పొడగించాలని కమిటీ ప్రతిపాదించింది. పదో తరగతి వరకు మాత్రమే ఉండడం వల్ల చాలా మంది బాలికలు ఉన్నత విద్య కొనసాగించలేకపోతున్నారని, తద్వారా బాల్యవివాహాలు కొనసాగుతున్నాయని కమిటీ అభిప్రాయపడింది. అదేవిధంగా జవహార్ నవోదయ లాంటి విద్యాలయాలు జిల్లాకొకటి చొప్పున బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలంది. మహిళల విద్యను ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రానికొక మహిళా యూనివర్శిటీ ఏర్పాటు చేయాలన్నది.  ఈ సమావేశంలో ఒరిస్సా రాష్ట్రం పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ మంత్రులు, కేబ్ అధికారులు పాల్గొన్నారు.
కళింగ యూనివర్శిటీ చైర్మన్ ను చూసి కార్పోరేట్ సంస్థలు నేర్చుకోవాలి- ఉప ముఖ్యమంత్రి
భువనేశ్వర్ లో గిరిజనుల కోసం ప్రత్యేకంగా 27వేల మంది విద్యార్థులతో నడుస్తున్న కళింగ యూనివర్శిటీని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, టిఆర్ఎస్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి తదితరులు నేడు సందర్శించారు. రాష్ట్రం నుంచి వెళ్లిన ఉప ముఖ్యమంత్రి, మేయర్ ను కళింగ యూనివర్శిటీ చైర్మన్ డాక్టర్ సమంతా 27వేల మంది విద్యార్థుల సమక్షంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం కేజీ టు పీజీ విద్యను అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటే…ఈ యూనివర్శిటీలో కేజీ టు పీజీ విద్య అమలు జరుగుతోందన్నారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని ఒక వ్యక్తిగా డాక్టర్ సమంతా చేస్తుండడం చాలా గొప్ప విషయంగా అభివర్ణించారు. అంతేకాకుండా కార్పోరేట్ సంస్థలు డాక్టర్ సమంతాను చూసి చాలా నేర్చుకోవాలన్నారు. కార్పోరేట్ సంస్థ  కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇలాంటి పనులు చేయాల్సి ఉన్నా చాలా వరకు చేయడం లేదన్నారు. ఈ యూనివర్శిటీని చూసైనా కార్పోరేట్ సంస్థలు సిఎస్ఆర్ కింద ఇలాంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. ఇక కళింగ యూనివర్శిటీలో చదువుతున్న విద్యార్థులకు ఇక్కడ మంచి అవకాశాలు అనేకం అందుబాటులో ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి కడియం అన్నారు. ఉన్నత స్థాయికి ఎదగాలనుకునే విద్యార్థులకు ఈ యూనివర్శిటీ గొప్ప అవకాశమన్నారు. ఇక్కడ విద్యార్థులకు అనేక రంగాల్లో శిక్షణ కల్పిస్తున్నారని, అయితే సివిల్స్ లో కూడా వీరికి శిక్షణ ఇస్తే మంచి సివిల్స్ అధికారులు కూడా తయారయ్యే అవకాశం ఉందన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10131
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author