వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేర్చుతూ ఏపీ అసెంబ్లీ తీర్మానం

వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేర్చుతూ ఏపీ అసెంబ్లీ తీర్మానం
December 02 18:28 2017
అమరావతి
వాల్మీకి, బోయలను ఎస్టీల జాబితాలో చేర్చుతూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ, దశాబ్దాల తమ కల నెరవేరిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు దేవుడిలా కనబడుతున్నారని చెప్పారు. ఈ బిల్లుతో దశాబ్దాల పాటు దోపిడీకి గురైన ఓ సామాజిక వర్గంలో సరికొత్త ఆశలు చిగురించాయని అన్నారు.వాల్మీకి, బోయలకు వాల్మీకి జయంతి పెద్ద పండుగ అని… ఈ బిల్లుతో ఈ రోజు మరో పెద్ద పండుగ వచ్చిందని చెప్పారు. వాల్మీకి, బోయలను ఎస్టీలలో చేర్చడం వల్ల గిరిజనులకు ఎలాంటి నష్టం వాటిల్లదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును త్వరగా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాల్వ శ్రీనివాసులు బోయ సామాజికవర్గానికి చెందిన నేత అనే విషయం తెలిసిందే.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10137
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author