చైన్ స్నాచర్ అరెస్టు

చైన్ స్నాచర్ అరెస్టు
December 02 18:47 2017
హైదరాబాద్,
ఉదయం ఆరు గంటలనుంచి ఏడు  గంటలు. మళ్లీ సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు అతడి డ్యూటీ. ఆ సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తాడు. వెనుక నుంచి నడుస్తూ వచ్చి చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతాడు. రెండు సంవత్సరాలుగా చైన్ స్నాచింగ్ చేస్తూ దొరకని దొంగనను  సిసి కెమెరాలు,  ఫేస్ బుక్ ప్రియురాలు పట్టించాయి. ఈ .చైన్ స్నాచర్ ని శనివారం నాడు బేగంపేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్నుంచి 15తులాల బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన కలోచి ఫారూఖ్ హైద్రాబాద్ లోని నేరేడ్ మెట్ లో ఉంటున్నాడు. డిగ్రీ వరకు చదువుకున్న ఫారూఖ్,  బేగంపేట్ లో ప్రైవేట్ జాబ్ చేశాడు. జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నాడు. అమ్మాయిలు, ఫ్రెండ్స్ తో ఫేస్ బుక్ లలో ఛాటింగ్ చేసి పరిచయాలు పెట్టుకుని ఎంజాయ్ చేసుకునేవాడు.
నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను ఉదయం, సాయంత్రం 7 గంటల సమయంలో టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్ లకు పాల్పడేవాడు. రెండు సంవత్సరాలలో 9 చైన్ స్నాచింగ్ లు చేసి పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నాడు. సోషల్ మీడియా ప్రియురాలి సహాయంతో సిసి పుటేజిల ఆధారంగా చైన్ స్నాచర్ ను అరెస్ట్ చేశారు. వారి నుంచి నాలుగున్నర లక్షల విలువ చేసే 15 తులాల బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని రిమాండ్ కు తరలిస్తున్నట్లు నార్త్ జోన్ డిసిపి సుమతి తెలిపారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10150
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author