గాంధీ ఆసుపత్రిలో కీచక సిబ్బంది అరెస్టు

గాంధీ ఆసుపత్రిలో కీచక సిబ్బంది అరెస్టు
December 03 00:11 2017
హైదరాబాద్,
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి పేథ్యాలాజి ల్యాబ్ లో ట్రైనీ మహిళలను లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నలుగురు ల్యాబ్ టేక్నిషియన్లను చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసారు. ఈ ఘటనపై నార్త్ జోన్ డీసీపీ సుమతి వివరాలు వెల్లడించారు. లాబ్ టెక్నిషియన్లను ను వేధిస్తున్న సీనియర్ టెక్నీషిన్స్ పై ఫిర్యాదు రావడంతో నలుగురిని  అరెస్ట్ చేసామని ఆమె అన్నారు. తమను వేధిస్తున్నారని గత ఆగస్టు లోనే ఆసుపత్రి సుపరిటెండెంట్ కు బాధితులు ఫిర్యాదు చేసారు. దాంతో అయన వేధింపుల పర్వంపై విచారణకు గాను ఒక ప్రత్యేక వైద్యుల బృందాన్ని నియమించారు. ఆ బృందం సేకరించిన అధారాలతో పోలీసులుకు ఫిర్యాదు అందింది. దాంతో పోలీసులు కుడా రంగంలోకి దిగి విచారణ జరిపారు. చివరకు పక్కా ఆధారాలతో నలుగురిని అరెస్టు చేసారు.
ఎవరికి భయపడకుండా ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగితే నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయండని డీసీపీ మహిళలకు సూచించారు. ఈ కేసులో నిందితులపై  రికార్డ్ టైమ్ లో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాం. అలాగే, ఫిర్యాదు చేసిన బాధితుల వివరాలు గోప్యంగా వుచుతామని ఆమె అన్నారు. బాధితులలో మైనర్ లు ఉంటే పోస్కో ఆక్ట్ కూడా నమోదు చేస్తామని సుమతి అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10178
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author