కౌంటర్ ఇచ్చేందుకు  అమెరికా రెడీ

కౌంటర్ ఇచ్చేందుకు  అమెరికా రెడీ
December 04 11:13 2017
న్యూఢిల్లీ,
ఉత్తర కొరియా ఒకవేళ క్షిపణి దాడులకు పాల్పడితే వాటిని సమర్థంగా తిప్పికొట్టే రక్షణ వ్యవస్థను ఏర్పాట్లు చేయడానికి అమెరికా యంత్రాంగం ముమ్మరం చేసింది. ఉత్తర కొరియా గతవారం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన నేపథ్యంలో ముఖ్యంగా పశ్చిమ తీరంలో అధునాత క్షిపణి విధ్వంసక వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నట్లు కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు పేర్కొన్నారు. పశ్చిమ తీరంలోని టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్‌తో సహా యాంటీ-బాలిస్టిక్ మిసైల్స్‌ను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. దక్షిణ కొరియా తీరంలోనూ అధునాతన రక్షణ వ్యవస్థను మొహరించినట్లు తెలియజేశారు.ఈ ఏడాది వరుస అణు, క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తోన్న ఉత్తర కొరియా వల్ల భవిష్యత్తులో ప్రమాదం ముంచుకొస్తే సమర్థంగా ఎదుర్కొనేందుకు అమెరికా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గత బుధవారం ఉత్తర కొరియా పరీక్షించిన అధునాతన ఖండాతర బాలిస్టిక్ క్షిపణి సుమారు 13 వేల కిలోమీటర్లు అంటే 8080 మైళ్ల దూరంలోని లక్ష్యాలను చేరుకోగలదని, ఇందులో అమెరికా రాజధాని వాష్టింగ్టన్ కూడా ఉందని దక్షిణ కొరియా శుక్రవారం ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన అమెరికా పశ్చిమ తీరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసే చర్యలను ప్రారంభించింది. అమెరికా ఆర్మ్‌డ్ సర్వీసెస్ కమిటీ, స్ట్రాటజీక్ ఫోర్సెస్ సబ్-కమిటీలతో కాంగ్రెస్ సభ్యుడు మైక్ రోజర్స్ సమావేశమయ్యారు. పశ్చిమ తీరంలో చేపట్టాల్సిన చర్యలు గురించి ఈ సందర్భంగా చర్చించారు.దీనికి అవసరమైన నిధులను 2018 రక్షణ బడ్జెట్‌లో కాకుండా ప్రత్యేకంగా కేటాయించాలని సూచించారు. ఇవి కేవలం ఓ ప్రాంతంలో చేపట్టాల్సిన సిఫార్సులే కానీ, పర్యావరణ ప్రభావం కూడా ఉంటుందని రిపబ్లికన్ పార్టీకి చెందిన అలబామా కాంగ్రెస్ నేత తెలిపారు. యాంటీ-మిసైల్ వ్యవస్థ ఏర్పాటుపై అధికారికంగా ప్రకటన చేయకపోయినా, దీనికి సంబంధించిన చర్యలు మాత్రం వేగవంతం చేసింది. గత కొన్ని నెలలుగా అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మరోవైపు నిరంతరం ఉత్తర కొరియా అణ్వాయుధ ప్రయోగాలు, క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దుందుడుకు వైఖరికి తోడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు అగ్నికి ఆజ్యం పోసినట్లున్నాయి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10217
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author