ఇక స్టాంపులు, రిజిస్ట్రేషన్ల అవకతవకలకు చెక్…

ఇక స్టాంపులు, రిజిస్ట్రేషన్ల అవకతవకలకు చెక్…
December 04 13:36 2017
నిజామాబాద్,
స్టాంపులు, రిజిస్ట్రేషన్ కార్యాలయా ల్లో జరుగుతున్న అవకతవకలను, అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు, దళారులు, మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించేందుకు సర్కారు కార్యాలయాల్లో సీసీ కెమెరా లు, మానిటర్‌లను ఏర్పాటు చేసింది. ఇకపై రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొత్తం అధికారులు వీడియో షూట్ చేయనున్నారు. వీడియో సీడీలను రూపంలో మార్చి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రయ, విక్రయదారులకు అందించనున్నారు.  తాజాగా సర్కా రు రాష్ర్టానికి కొత్త సర్వర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త సర్వర్‌తో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు డాటా మైగ్రేషన్ చేసేందుకు వీలుగా నాలుగు రోజుల పాటు రిజిస్ట్రేషన్లన్నింటినీ నిలిపివేసింది. జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత ఆదిలాబాద్ నూతన జిల్లాలో ఆదిలాబాద్, బోథ్‌లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. ఆస్తులకు సంబంధించిన క్రయ, విక్రయాలు, సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, మాటిగేజ్, రిలీజు, పార్టేషన్ డీడ్, వీల్ డీడ్ కింద నిర్దేశిత ఛార్జీలు వసూలు చేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. జిల్లాలోని రెండు కార్యాలయాల పరిధిలో నెలకు సగటున 50 వరకు ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా.. సుమారు రూ.75 లక్షల ఆదాయం సమకూరుతోంది. రిజిస్ట్రేష న్ ప్రక్రియలో అనేక లొసుగులు ఉండడంతో అవినీ తి, అక్రమాలకు అవకాశం కలుగుతోంది. అధికారుల పై కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఒకరి పేరిట ఉన్న స్థ్ధిరాస్తులను ఒకరికి మాత్రమే విక్రయించాల్సి ఉన్నా ఇద్దరు, ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలు ఉన్నాయి. వేలిముద్రల ఆధారంగా మొదట్లో రిజిస్ట్రేషన్లు జరగడంతో ఒకరి పేరిట ఉన్న భూమిని మరొకరికి, ఇంకొకరికి సులభంగా రిజిస్ట్రేషన్ అయ్యే వి. ఆ తర్వాత స్థిరాస్తుల క్రయ విక్రయల్లో సాక్షులను ప్రవేశ పెట్టారు. రిజిస్ట్రేషన్ పత్రాలపై క్రయ, విక్రయదారులతోపాటు సాక్షుల సంతకాలు తీసుకునేవారు. అయినా అక్రమ రిజిస్ట్రేషన్‌కు అడ్డుకట్ట వేయలేక పోయారు. 2003-04 నుంచి క్రయ, విక్రయదారుల ఫొటోలను రిజిస్ట్రేషన్ పత్రాలపై అంటించడం ప్రారంభించినా అక్కడక్కడ అక్రమ రిజిస్ట్రేషన్లు, బెదిరింపు లు తప్పలేదు. రిజిస్ట్రేషన్లు జరిగిన చాన్నాళ్లకు వారసు లు తిరగబడిన కేసులు కూడా అనేకం ఉన్నాయి.స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో జరుగుతున్న అక్రమాలు, పొరపాట్లు ఉద్దేశ పూర్వకంగా చేస్తున్న తప్పుల కారణంగా అనేక వివాదాలు తలెత్తుతున్నా యి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్టాంపు లు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలను, మా నిటర్‌ను ఏర్పాటు చేసింది. రిజిస్ట్రేషన్ సమయంలో ఏర్పడే సాంకేతిక సమస్యలను నివారించేందుకు కొత్త సర్వర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త సాం కేతికతతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను అనుసంధానం చేసేందుకు ఐదు రోజుల పాటు ఆదిలాబాద్, బోథ్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. రిజిస్ట్రేషన్‌కు అవసరమైన ధ్రు వపత్రాలు, క్రయ, విక్రయదారుల వివరాలు, సాక్షుల సంతకాలు, వేలిముద్రలు, ఆధార్ నంబర్, సబ్ రిజిస్ట్రార్ వద్ద ఆస్తులు అమ్ముతున్నట్లు, కొనుగోలు చేస్తున్నట్లు ఇచ్చే వాంగ్మూలం తదితర విషయాలన్ని కెమెరాలో నిక్షిప్తం కానున్నాయి. క్రయ, విక్రయదారులకు వీడియో ఫుటేజీని సీడీల రూపంలో అందజేయనున్నారు. ఈ విధానంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో దళారు లు, మధ్యవర్తులు ప్రమేయం తగ్గి పారదర్శకత పెరుగుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10257
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author