సీసీఐ కేంద్రాల్లో ప్రైవేట్ వ్యాపారుల దందా

సీసీఐ కేంద్రాల్లో ప్రైవేట్ వ్యాపారుల దందా
December 04 13:45 2017
అదిలాబాద్,
ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, బోథ్, సొనాల, నేరడిగొం డ, పొచ్చెర, ఇంద్రవెల్లి, నార్నూర్, ఇచ్చోడ, జైనథ్‌లో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు సీసీఐ 7560 క్వింటాళ్ల పత్తిని 457 మంది రైతు ల నుంచి కొన్నారు. ఇందులో జైనథ్‌లో 1967.31 క్వింటాళ్లు, ఇచ్చోడలో 938.30 క్వింటాళ్లు, ఇంద్రవెల్లి లో 18.15క్వింటాళ్లు, పొచ్చెరలో 83.20 క్వింటాళ్లు, బోథ్‌లో 195.85క్వింటాళ్లు, నేరడిగొండలో 3107. 05 క్వింటాళ్లు, సొనాలలో 852.88 క్వింటాళ్లు, ఆదిలాబాద్‌లో 397 క్వింటాళ్లు కొన్నారు. ప్రైవేటు వ్యాపారులు 11,19,970 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఆదిలాబాద్‌లో 8,69,387 క్వింటాళ్లు, సొనాలలో 1,58, 278 క్వింటాళ్లు, ఇంద్రవెల్లిలో 19,869.5 క్వింటాళ్లు, జైనథ్‌లో 27,099 క్వింటాళ్లు, ఇచ్చోడలో 39959, నార్నూర్‌లో 5377 క్వింటాళ్ల చొప్పున కొన్నారు. గత ఏడాది ప్రైవేటు వ్యాపారులు ఇదే సమయానికి కేవలం 4,62,669 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. నిర్మల్ జిల్లాలో భైంసా, నిర్మల్, సారంగాపూర్, ఖానాపూర్, కుభీర్‌లో సీసీఐ కొనుగోలు కేంద్రాలు పెట్టగా.. ఇప్పటి వరకు 293మంది రైతుల నుంచి కేవ లం 4750.28క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేశా రు. భైంసాలో 775.43క్వింటాళ్లు, నిర్మల్‌లో 2760. 85క్వింటాళ్లు, సారంగాపూర్‌లో 1214 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేశారు. గత ఏడాది సీసీఐ ఒక్క క్వింటా కూడా కొనలేదు. ప్రైవేటులో పెద్ద ఎత్తున పత్తి కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు 2,03, 839 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. గత ఏడాది ఇదే సమయానికి కేవలం 34,594క్వింటాళ్లు మాత్రమే కొన్నారు. ఈ సారి భైంసాలో 1,25, 806.81క్వింటాళ్లు, నిర్మల్‌లో 32, 313.87క్వింటాళ్లు, సారంగాపూర్‌లో 16,983. 64 క్వింటాళ్లు, ఖానాపూర్‌లో 534క్వింటాళ్లు, కుభీర్‌లో 28200.45క్వింటాళ్ల చొప్పున కొన్నారు. సీసీఐ మద్దతు ధర క్వింటాలుకు రూ.4320 ప్రకటించగా… మద్దతు ధర కంటే రూ. 150-200 క్విం టాలుకు ఎక్కువగా ప్రైవేటు వ్యాపారులు చెల్లిస్తున్నారు. దీంతో రైతులు సీసీఐ కేంద్రాల కంటేప్రైవేటులోనే విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటివరకు రెండు జిల్లాలో కలిపి ప్రైవేటు వ్యాపారులు 13,28, 559 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. సీసీఐ కేంద్రాల్లో కేవలం 12,310 క్వింటాళ్లు మాత్రమే కొనుగోళ్లు చేశారు. నిర్మల్ జిల్లాలో ఈ ఏడాది 12లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇప్పటివరకు 2,08,589.28క్వింటాళ్ల పత్తి మార్కెట్ విక్రయానికి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో 22లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేయ గా..11,27,530 క్వింటాళ్లు మార్కెట్‌కు విక్రయానికి వచ్చింది. ఇప్పటికే రెండు జిల్లాలోనూ సగానికిపైగా పత్తి పంటను ఏరేశారు. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. ప్రభుత్వరంగ సంస్థల ఆధ్వర్యంలో చేపట్టిన సోయాబీన్ కొనుగోళ్లు చివరిదశకు చేరాయి. హాకా ఆధ్వర్యం లో రెండు జిల్లాల్లో కలిపి 8 కేంద్రాలు ఏర్పాటు చేశా రు. ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ, ఆదిలాబాద్, బోథ్, జైనథ్, నిర్మల్ జిల్లాలో నిర్మల్, భైంసా, సారంగాపూర్, కుభీర్‌లో సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిర్మల్‌లో నాలుగు కేంద్రాలకుగాను మూడు కేంద్రాల్లో కొనుగోళ్లు చేయగా.. 2746 క్వింటాళ్ల సోయాను 1593 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. రూ. 8.38 కోట్ల విలువైన పంటను కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 3094 మంది రైతుల నుంచి 55,253.5 క్వింటాళ్ల సోయాబీన్‌ను కొనుగోలు చేశా రు. ఆదిలాబాద్‌లో 486 మంది నుంచి 8137 క్విం టాళ్లు, బోథ్‌లో 762 మంది నుంచి 13180 క్విం టాళ్లు, ఇచ్చోడలో 881 మంది నుంచి 16,665 క్విం టాళ్లు, జైనథ్‌లో 965మంది నుంచి 17281.5 క్విం టాళ్లు కొనుగోలు చేశారు. మొక్కజొన్నకు సంబంధించి నిర్మల్ జిల్లాలో 11 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 8208 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొ న్నారు. 2429 మంది రైతుల నుంచి రూ. 11.70 కోట్ల విలువైన మొక్కజొన్న పంటను కొనుగోలు చేశారు. మినుములకు సంబంధించి భైంసా, కుభీర్‌లో రెండు చోట్ల పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు పెట్టారు. 2446 మంది రైతుల నుంచి 2437 టన్నుల మినుములు కొనుగోలు చేశారు. కుభీర్‌లో మినుమల కొనుగోళ్లు పూర్తవ్వగా.. భైంసాలో మార్కెట్లో ఉన్న వాటికి మాత్రం కొనుగోలు చేస్తున్నారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10263
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author