మురికి కూపంగా మారిన నాగలేరు

మురికి కూపంగా మారిన నాగలేరు
December 04 14:11 2017
శ్రీకాకుళం,
ఒకప్పుడు జీవనది నాగులేరు. నాగులేరులో స్నానం చేస్తే పుణ్యంతో పాటు రోగాలు దూరం అనే ప్రగాఢ నమ్మకం.  పల్నాడులో పుట్టిన ప్రతి ఒక్కరూ నాగులేరులో మునిగి తేలాల్సిందే. పల్నాడు చరిత్రలో నాగులేరు నది అంతటి ప్రత్యేక స్థానం ఉంది.  కానీ ఇప్పుడు మాత్రం కొందరి స్వార్థంతో వ్యర్థాలతో నిండిపోయింది.   చిన్న చిన్న రాళ్ళు…,  చిల్లర దేవుళ్ళు…, నాగులేటి నీళ్ళు…, నాపరాళ్ళు…, సజ్జ జొన్న కూళ్ళు…, సర్పంబులు, తేళ్ళు…, పలనాటి సీమల పల్లెటూళ్ళు…., అని శ్రీనాథుడు వాపోయాడంటే…. వాపోడూ మరి.  పల్నాడు ప్రాంతానికే తలమానికంగా ఉంటుంది అక్కడి నాగులేటి నది. నల్లమల పర్వతాల్లో కారంపూడికి ఎగువవ పుట్టిన నాగులేరు నది ఆ ప్రాంతంలోని కొట్రపాడు వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.  ఒకప్పటి నాగులేరు నదికి ఉన్న ప్రాముఖ్యత విన్నవారు…. ప్రస్తుతం నాగులేరులో మునిగితే అంటువ్యాధులుతో పాటు ఫ్రీగా ఊహించని జబ్బులు వస్తాయి. అంతలా మురికి కూపంగా మారింది. ఒకనాటి పల్నాటి యుద్ధంలో రక్తపుటేరు పారించింది ఈ నది. ఇప్పుడు మాత్రం మురికి… పందులకు అడ్డాగా మారింది ఈ దాచేపల్లి నాగులేరు.గుంటూరు జిల్లా దాచేపల్లి పట్టణంలోని నాగులేరు ఒకప్పుడు జీవనదిగా ఉండేది.  నేడు మురికికూపంగా మారింది. దుర్వాసన వెదజల్లుతూ అంటురోగాల వ్యాప్తికి కేంద్రంగా మారింది. దాచేపల్లి-నారాయణపురం గ్రామాలు గుంటూరు జిల్లాలోనే జంట గ్రామాలుగా పేరు పొందాయి. దాదాపు లక్షా మంది నివసించే గ్రామాల్లో ప్రభుత్వ పెద్దలు ఆదాయ మార్గాలు తప్ప పరిశుభ్రత మీద దృష్టి సారించటంలేదు. అనేక మంది అంటురోగాల బారిన పడుతున్నాఅధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.  స్స్వచ్ఛభారత్ ప్రకటనల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రభుత్వం… దాచేపల్లి గ్రామ పంచాయితీ అధికారులు శుభ్రత మీద దృష్టి సారించలేక పోతున్నారు. ఇప్పటికైనా స్పందించి పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10281
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author