అన్నదాతలను దెబ్బ తీస్తున్న ఖరీఫ్

అన్నదాతలను దెబ్బ తీస్తున్న ఖరీఫ్
December 04 14:33 2017
అనంతపురం,
తొలకరి వర్షాలతో రైతుల్లో ఆశలు రేకెత్తించిన ఖరీప్‌ పంట కాలం… విత్తు తర్వాత చినుకు నేలకు రాలకపోవడంతో అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీసింది. అప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయి.. నానా కష్టాలు పడుతున్న రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి విషమించే వరకూ మీనమేషాలు లెక్కిస్తూ వచ్చింది. పంట ఎండిపోతుండగా అంటే రెండున్నర నెలల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హఠాత్తుగా తెరపైకి వచ్చారు. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తన దృష్టికి తీసురాలేదని తప్పంతా అధికారులపై నెట్టేశారు. నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉంటూ ఏ ఒక్క ఎకరా పొలం కూడా ఎండిపోనివ్వబోనని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే రెయిన్‌గన్‌లతో రక్షకతడులు అంటూ హడావుడి చేశారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబునే వచ్చి తన పొలంలో రక్షక తడులు ప్రారంభించడంతో ఆ బడుగు రైతు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక తన పంట పండుతుందని, ఇంటిల్లిపాదీ సుఖసంతోషాలతో బతకవచ్చునని ఆశించాడు. పంట దిగుబడి వచ్చిన తర్వాత చూస్తే… బతుకు బజారు పాలైంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో అమడగూరు మండలం గుండువారిపల్లికి చెందిన రైతు శివన్న తనకున్న ఎనిమిది ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేపట్టారు. పంట పెట్టుబడి కింద రూ.1.20 లక్షలు అప్పు చేశారు. వర్షాభావ పరిస్థితులతో పంట ఎండు ముఖం పట్టింది. పంట మొత్తం ఎండిపోయింది. ట్రాక్టర్‌తో ఎనిమిది ఎకరాల పొలంలో వేరుశనగ పంట తొలగిస్తే… 20 కిలోల కాయలు మాత్రమే వచ్చాయి! స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే పర్యటించి రక్షకతడులు ప్రారంభించిన పొలం రైతు పరిస్థితే ఇలా ఉంటే మరి మిగిలిన రైతుల బతుకులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.  ఎనిమిది ఎకరాల్లో పంట సాగుకు అయిన రూ.1.20 లక్షల అప్పు ఎలా తీర్చాలో అర్థం కాక మదన పడుతున్న శివన్న.. మరో కొత్త సమస్య మరింత చిక్కుల్లో నెట్టేసింది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10296
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author