మళ్లీ పెరిగిన ఉల్లి రేటు 

మళ్లీ పెరిగిన ఉల్లి రేటు 
December 04 15:13 2017
వరంగల్,
ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూరగాయల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపాయి. డిమాండ్‌కు తగ్గ సప్లై లేకపోవడంతో ఎక్కడ చూసినా వాటి ధరలు మండిపోతున్నాయి. పరిస్థితి ఇప్పుడిప్పుడే నెమ్మదిగా అదుపులోకి వస్తుందనుకుంటున్న తరుణంలో వినియోగదారులపై మరో బాంబు పడింది. ఉల్లి రేటు అమాంతం పెరిగిపోయింది. దీంతో సామాన్యులు కూరగాయలు కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్న పరిస్థితి నెలకొంది. ఉల్లిని కోస్తే కాదు… ఇప్పుడు కొనాలన్నా కన్నీరు వస్తోందని అంతా వ్యాఖ్యానిస్తున్నారు. రెండు నెలల క్రితం కిలో రూ. 20 ఉన్న ఉల్లి రేటు ఇప్పుడు ఏకంగా రూ.60 దాటిపోవడం ఆశ్చర్యపరుస్తోంది. వినియోగదారులు ఇబ్బందులు పడుతుండగా.. తాజాగా ఉల్లి ధర పెరిగిపోవడంతో ఏం కొనాలో ఏం తినాలో అర్ధం కావడంలేదన్న కామెంట్స్ జనాల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
ఉల్లి రేటు ఇప్పట్లో దిగే ఛాన్స్ లేనట్లు వార్తలొస్తున్నాయి. మరో మూడు నెలల వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏటా 1600 హెక్టార్లలో ఉల్లి పంటను సాగు చేస్తున్నారు. ఈసారి ఖరీఫ్‌లో 600 హెక్టార్లలోనే పండించినట్లు అధికారులు చెప్తున్నారు. పంట బాగా పండితే ఎకరానికి 12 నుంచి 15 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. సెప్టెంబరు, అక్టోబరులో భారీ వర్షాలు పడడంతో ఉల్లి పంట దారుణంగా దెబ్బతింది. దీంతో దిగుబడి తగ్గిపోయింది. మరోవైపు మన మార్కెట్లకు సరకును పంపే షోలాపూర్‌, నాందేడ్‌, నాసిక్‌, కర్నూలులోనూ వానలు జోరుగా పడ్డాయి. అక్కడా పంటకు నష్టం వాటిల్లింది. ఫలితంగా ఉల్లికి కొరత ఏర్పడింది. ఇదే అదనుగా వ్యాపారులు ధరలను పెంచేశారు. రబీలో సాగు చేసిన ఉల్లి చేతికి వచ్చే వరకు ధరల ప్రభావం ఇలాగే ఉంటుందని సమాచారం. అదే నిజమైతే వచ్చే ఏడాది ఫిబ్రవరికి గానీ ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉండదని అంటున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10302
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author