సుందరం..సాగరతీరం..

సుందరం..సాగరతీరం..
December 05 11:57 2017
పశ్చిమగోదావరి,
పశ్చిమగోదావరిలోని పేరుపాలెం బీచ్ పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది. ప్రకృతి రమణీయ దృశ్యాలతో కనువిందు చేస్తోంది. ఉషోదయవేళలో సముద్రపు అలలు, ఇసుక తిన్నెలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మొగల్తూరు నరసాపురం మండలాల పరిధిలో 19 కిలో మీటర్ల మేర ఈ సముద్ర తీరం ఉంది. దీనిలో పేరుపాలం, మోళ్ళపర్రు ప్రాంతాలు బీచ్ లుగా ప్రసిద్ది చెందాయి. జిల్లాలో పర్యాటక కేంధ్రం పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది పేరుపాలెమే. ఈ బీచ్ కు మరో విశేషం ఏమింటంటే సముద్రతీరాన, వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం, వెళ్ళంగిని మాత ఆలయాలు. ఈ రెండు ఆలయాలు నిర్మించిన తరువాత ఇక్కడ బీచ్ కు వచ్చే సందర్శకులతో పాటు భక్తుల సందడి బాగా పెరిగింది. బీచ్ సమీపంలో రెండు ఆలయాలు నిర్మించడంతో సర్వమత మానవత్వాన్ని ప్రబోధిస్తున్నట్లుగా కనిపిస్తుంది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా తెలంగాణా, మరియు ఇత రాష్ట్రాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతటి ప్రఖ్యాతి గాంచిన పేరుపాలెం బీచ్ లో సౌకర్యాలు మరింతగా మెరుగుపరచాల్సి ఉంది.
పేరుపాలెం బీచ్ లో ప్రధాన సమస్య మహిళలకు మరుగుదొడ్లు లేకపోవడం సముద్ర స్నానం చేసి వచ్చిన మహిళలు బట్టలు మార్చుకోవడానికి రెస్ట్ రూమ్స్ లేకపోవడం సమస్యగా ఉంది. దీనికి తోడు ఆకతాయిల అల్లర్లకు కొదవలేదు. మరోవైపు బీచ్లో మద్యం అమ్మకాలు పూర్తిగా నిషేదించిన్నప్పటకి మద్యం అమ్మకాలు ఎదేచ్ఛగా సాగుతున్నాయి. బీచ్ లో పోలీస్ అవుట్ పోస్ట్ లు పెట్టినప్పటకి ఒక్క పోలీస్ కూడా దగ్గర కానరాడు సముద్రంలో స్నానాలు చేసేవారికి తగు జాగ్రత్తలు చేప్పేవారు లేకపోవడం, ప్రమాదవసాత్తూ సముద్రంలో కొట్టుకుపోయేవారిని రక్షించేందుకు గజఈతగల్లు లేకపోవడంతో చాలా మంది ప్రాణాలు సముద్రంలో కలిసి పోతున్నాయి. వీటితో పాటు బీచ్ కు వచ్చిన పర్యాటకులకు కూర్చోవడానికి బెంచీలు, త్రాగునీరు వంటి కనీస అవసరాలు అక్కడ కనిపించవు. అంతే కాకుండా బీచ్ లో త్రాగేసిన మద్యం బాటిల్స్, చెత్తాచెదారం వంటి కలుషిత పదార్దాలు ప్రాశాంతంగా సేద తీరుదామని  బీచ్ కు వచ్చిన పర్యటకులకు అసంతృప్తిని మిగులుస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకుని పేరుపాలెం బీచ్ ని అత్యంత సుందరంగా తీర్చి దిద్ది సముద్ర స్నానానికి వచ్చే పర్యాటకులకు కనీస వసతులు కల్పిస్తే బాగుంటుందని సముద్ర స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10346
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author