వింటర్ వండర్ లంబసింగి

వింటర్ వండర్ లంబసింగి
December 05 12:04 2017
వింటర్ వండర్ లంబసింగి
విశాఖపట్నం, డిసెంబర్ 5, (న్యూస్ పల్స్)
విశాఖలో చలి పంజా విసురుతుంది. చలితీవ్రత పెరగడంతో ఏజెన్సీ ప్రాంతాలు అరకు లంబసింగి పాడేరు లో ఉష్ణోగ్రతలు రోజురోజుకి తగ్గు ముఖం పడుతున్నాయి. ఉదయం 10 గంటల వరకు సూర్యుడు బయటకు రాని పరిస్థితి నెలకొంది. మంచు ప్రబావంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. సాధారణంగా ఈ సీజన్లో అరుకు లంబసంగి ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మంచు తెరల్లోంచి అరకు ప్రకృతి అందాలను పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు. ఏపీ పర్యాటక రంగానికి ఆయువుపట్టుగా నిలుస్తున్న లంబసింగి ప్రాంతం ఆర్దిక రాజధాని విశాఖకు తలామానికంగా నిలుస్తోంది. పర్యాటక ప్రేమికులను కట్టిపడేసే ప్రకృతి సౌందర్యాలను తన సిగలో సింగారించుకున్న లంబసింగి అందాలు ఎవరినైనా మయమరిపిస్తాయనే చెప్పాలి. ప్రత్యేకించి ప్రతీ ఏటా చివరి మూడు మాసాలలో అత్యదిక శాతం పర్యాటకులు లంబసింగి అందాలను తిలకించేందుకు క్యూ కడుతుంటారు. సహజసిద్దంగా జీవనం పోసుకున్న ప్రకృతి అందాలతో మమేకమైపోతారు. లంబసింగి అంటేనే అతి శీతలమైన ప్రదేశాలకు ప్రత్యేక గుర్తింపువచ్చింది. అంతకు మించి ఇక్కడి గ్రామస్ధుల కట్టుబొట్టు వ్యవహారశైలి, జీవన స్ధితిగతులు ఇవన్నీ లంబసింగి ప్రాంతానికి జాతీయ స్ధాయిలో ప్రత్యేకత వచ్చేలా చేశాయి.
 లంబసింగి పర్యాటనకు వచ్చే పర్యాటకులు ఇక్కడి అందాలను తిలకించడమే కాకుండా గిరిజనుల అలవాట్లు కూడా చూసి తెలుసుకుంటుంటారు. చలివేళ్లలో మంటలు కాసుకోవడం దగ్గర నుంచి చలిగాలులు వెముకులను వణికిస్తున్న సమయంలో వేడిగా కాఫీ తాగడం మంచి మధురానుభూతిని అందిస్తోంది. కొండలు, లోయలు… దాంట్లో దాగి ఉన్న అందాలను తిలకిస్తూ మధునారుభూతిని పొందడం ఆదో వరం. మంచు తెరలను చీల్చుకుంటూ భూతల స్వర్గాన్ని తలపించే లంబసింగి ప్రాంతంలో విహరించేందుకు పర్యాటకులు అమితంగా ఇష్టపడుతుంటారు.ఇప్పటి నుంచే చలి గాలుల ప్రభావంతో సరికొత్త అందాలను సింగారించుకున్న లంబసింగితో పాటుగా అరుకు, బొర్రా గుహలు ఇలా సహజసిద్ద సోయగాలతో పర్యాటకులను తన వైపు తిప్పుకుంటున్నాయి. క్షణాలు, రోజులు, నెలలు ఇలా ఎంత సేవు ఉన్నా తనివి తీరని ఆనందాన్ని పొందుతున్నారు. అందాలను చూసీ మురిసిపోవాలని సంబరపడే పర్యాటకులకు మౌళిక సదుపాయాల కొరత కాస్తా వెక్కిరిస్తోంది. కనీసం ప్రతీ ఏటా పర్యటకులు తాకిడి ఎక్కువగా ఉండే లంబసింగి ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలను ఏర్పాటు చెయ్యాలని పర్యాటకులు కోరుతున్నారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10352
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author