Show Menu
Home
Latest News
Andhra Pradesh
Telangana
others
People
Officers
Politicians
Common Man
Dark Voice
Atrocities
social boycott
Discrimination
Open Forum
Debate
Analysis
Case Study
Social Activist
Political
General
Aspirant
Finding
Follow up
Survey
Success Story
Film News
Others
Video
Custom links here:
Get exclusive News on demand : Live Tv on web
Download 7G News app on Google play store
IOS app coming soon
వైజాగ్ లో సోలార్ కరెంట్
December 05
14:48
2017
by Manjusha
విశాఖపట్టణం,
విద్యుత్ ఖర్చులను నియంత్రించుకుంటూ ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటున్న మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) భవిష్యత్‌లో సోలార్ విద్యుత్ ఉత్పత్తిపైనే దృష్టి సారిస్తోంది. హుదూద్ తుపాను అనంతరం నగరం అంతా ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసుకున్న జీవీఎంసీ విద్యుత్ వినియోగంలో 40 శాతం పొదుపు సొంతం చేసుకుంది. తాజాగా సోలార్ విద్యుత్ ఉత్పత్తికి విశేష ప్రాధాన్యతనిస్తూ ఉత్పత్తిని పెంచుకునే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా తొమ్మిది మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రతిపాదించిన జీవీఎంసీ తాజాగా మరో మూడు మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి టెండర్లను ఖరారు చేసేందుకు సిద్ధం అవుతోంది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో తొమ్మిది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి గాను రూ.58 కోట్లను వెచ్చించనున్నారు. తాజాగా మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌పై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడం ద్వారా మూడు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రతిపాదించి, అందుకు అనుగుణంగా నివేదిక సిద్ధం చేస్తున్నారు. నీటిపై తేలియాడే సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు చేయడం వల్ల ఉత్పత్తయ్యే విద్యుత్ నాణ్యతతో పాటు పలు అంశాల్లో లాభదాయకంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా నగర పరిధిలో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసేందుకు ఖాళీ స్థలాల అవసరం. అయితే నగరంలో ఖాళీ స్థలాల లభ్యత ఆషామాషీ కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రిజర్వాయర్లు, కాలువలపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే గతంలో ముడసర్లోవ రిజర్వాయర్‌లో సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేయడం ద్వారా రెండు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. భావించారు. నీటిపై తేలియాడే సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తయే విద్యుత్ నాణ్యత బాగుంటుందన్నది అధికారుల అభిప్రాయం. అలాగే ఏలేరు కెనాల్‌పై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడం ద్వారా మరో ఐదు మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి సాధించనున్నారు. దీనితో పాటు జీవీఎంసీ కార్యాలయాలు, మున్సిపల్ పరిధిలోని పాఠశాలల్లో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడం ద్వారా మరో నాలుగు మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో జీవీఎంసీ పరిధిలో సోలార్ విద్యుత్ అందుబాటులోకి రానుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
Please follow and like us:
http://www.7gnews.in/?p=10425
Follow
Article "tagged" as:
solar power
Categories:
Andhra Pradesh
Latest News
People
view more articles
About Article Author
Manjusha
View More Articles
view more articles
Related Articles
పలు రైళ్లను పొడిగించిన రైల్వేలు
పొలం పనుల కోసమే … కులం : గిడ్ల సుజాత
డిజిటల్ క్యాపిటల్ గా ఏపీ
Close Window
Loading, Please Wait!
This may take a second or two.