గ్రేటర్ లో క్రిస్మ‌స్ ఉత్స‌వాలు

గ్రేటర్ లో క్రిస్మ‌స్ ఉత్స‌వాలు
December 06 14:54 2017
హైదరాబాద్,
నగరం లో క్రిస్మస్ వేడుకల నిర్వహణపై మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.ఈ సమావేశానికిడిప్యూటీ మేయర్ బాబా ఫసిఉద్దీన్, మైనారిటీ శాఖ సలహాదారు ఏ కే ఖాన్, జీహెచెమ్స్సి కమీషనట్ జనార్దనరెడ్డి, మైనారిటీ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్,కార్పొరేటర్లు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మేయర్ ఈ క్రింది అంశాలను వెల్లడించారు.
క్రిస్మ‌స్ పండుగ‌ను పుర‌స్క‌రించుకొని జీహెచ్ఎంసీ ప‌రిధిలో 200 ప్రాంతాల్లో పేద క్రిస్టియ‌న్‌ల‌కు గిఫ్ట్ ప్యాకెట్లు, క్రిస్మ‌స్ విందును నిర్వ‌హిస్తారు. ప్ర‌తి డివిజ‌న్‌లో ఒక ప్రాంతాన్ని సంబంధిత కార్పొరేట‌ర్ గుర్తించాలి. ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క ప‌రిధిలో క‌నీసం రెండు ప్రాంతాల‌ను సంబంధిత ఎమ్మెల్యే ఎంపిక చేయాలి. ప్ర‌తి లొకేష‌న్‌లో 500 గిఫ్ట్ ప్యాక్‌ల‌ను పంపిణీ చేస్తారు. డిసెంబ‌ర్ 14వ తేదీ న కొత్త బ‌ట్ట‌ల‌ను పంపిణీ చేస్తారు.డిసెంబ‌ర్ 18వ తేదీన క్రిస్మ‌స్ ఫీస్ట్ నిర్వ‌హిస్తారు.  క్రిస్మ‌స్ గిఫ్ట్ ప్యాక్‌, ఫీస్ట్ నిర్వ‌హ‌ణ‌కు వేదిక‌ను ఎంపిక చేయ‌డానికి డిప్యూటి క‌మిష‌న‌ర్లు సంబంధిత కార్పొరేట‌ర్లు, ఎమ్మెల్యేలు, చ‌ర్చీ ప్ర‌తినిధుల‌తో ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హిస్తారు.
 జీహెచ్ఎంసీ ప‌రిధిలో 200 ప్రాంతాల్లో 500 చొప్పున మొత్తం ల‌క్ష మందికి గిఫ్ట్ ప్యాకెట్లు పంపిణీ చేస్తారు. ప్ర‌తి గిఫ్ట్ ప్యాకెట్‌లో ఒక పాలిస్ట‌ర్ ప్యాంట్‌, ఒక‌ ష‌ర్ట్‌, ఒక చీర, జాకెట్ పీస్‌, సెల్వార్ క‌మీజ్ ఉంటాయి.డిసెంబ‌ర్ 18న నిర్వ‌హించే క్రిస్మ‌స్ ఫీస్ట్ విందులో  ఒకొక్క వేదిక ద్వారా 500మందికి బిర్యాని, రైతా, స్వీట్‌కేక్‌ల‌ను అందిస్తారు. క్రిస్మ‌స్ గిఫ్ట్‌ల‌ను నిరుపేద‌లు, దివ్యాంగులు, వితంతువులు, అనాథ‌లు, హెచ్.ఐ.వి పేషంట్లకు ప్రాధాన్య‌త ఇస్తారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10627
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author