ప్రభుత్వం పేరు చెప్పి దోచేస్తున్నారు…

ప్రభుత్వం పేరు చెప్పి దోచేస్తున్నారు…
December 06 16:25 2017
మహబూబ్ నగర్,
ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకోసం అంటూ కాంట్రాక్టర్  తరలిస్తున్న ఇసుక వ్యవహారం వివాదం రేపుతోంది. ఇప్పటికే తాగు, సాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ఇసుకను అడ్డగోలుగా తరలిస్తుండటంతో భవిష్యత్తులో భూగర్భ జలాలు అడుగంటి నరకయాతన అనుభవిస్తామని ప్రజలు, రైతులు వాపోతున్నారు. అయినా.. సంబంధిత కాంట్రాక్టర్ పోలీసుల పహారా మధ్య ఇసుకను యంత్రాలలో సహాయంతో రవాణా చేస్తుండటం పట్ల ప్రజలు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.నాగర్‌కర్నూల్‌ మండలంలోని దేశిటికాల శివారులో జిల్లా కలెక్టరేట్‌, ఎస్సీ కార్యాలయాల భవనాల నిర్మాణాలను చేపట్టిన విషయం తెలిసిందే. వీటి నిర్మాణాలకు ఇసుక అవసరముండగా.. అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తరలిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. నాగర్‌కర్నూల్‌ మండలంలో నిర్మించతలపెట్టిన జిల్లా కార్యాలయాల నిర్మాణాలకోసమంటూ  కొన్ని రోజులుగా కాంట్రాక్టర్ కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామ శివారులోని దుందుభి వాగు నుంచి ఇసుకను తరలిస్తున్నారు. ఇదే వాగు నుంచి ప్రతి సంవత్సరం రఘుపతిపేట, రామగిరి గ్రామాలకు నీటిని సరఫరా చేస్తారు. రెండు గ్రామాల రైతులకు ఈ వాగే పంటల సాగుకు ఆధారం. ఇంతటి ప్రాధాన్యమున్న దుందుభి వాగు నుంచి ఇసుకను తరలిస్తుండటంపై రెండు గ్రామాల రైతులు, ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయ భవనాల నిర్మాణాలకు ఇక్కడి ఇసుకే అనువుగా ఉంటుందంటూ పోలీసుల పహారా మధ్య దుందుభి వాగు నుంచి తరలిస్తున్నారు. కార్యాలయాల భవన నిర్మాణ పనులకు ఇక్కడి నుంచి గుత్తేదారు పోలీసుల సమక్షంలో భూగర్భ, జలవనరుల శాఖ (మైనింగ్‌) అధికారుల అనుమతులు లేకుండానే ఇసుకను తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పనులను దక్కించుకొన్న కాంట్రాక్టర్ దుందుభి వాగు నుంచి ఇసుకను తీసుకెళ్లడానికి అనుమతి ఉందంటూ చెబుతున్నాడేగానీ అనుమతుల పత్రాలను చూపడంలేదని గ్రామస్థులు పేర్కొంటున్నారు. అనుమతులు లేకుండా ఇసుకను ఎందుకు తరలిస్తున్నారంటూ పది రోజుల క్రితం గ్రామస్థులు సంబంధిత కాంట్రాక్టర్ తో వాగ్వాదానికి దిడి తరలించకుండా అడ్డుకొన్నారు. దీంతో రెండు రోజుల పాటు ఇసుక అక్రమ రవాణాను నిలిపేశారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఇసుకను తరలిస్తున్నామంటూ స్వయంగా పోలీసులే రంగంలోకి దిగి ఇసుకను తరలిస్తుండటం గమనార్హం. భవన నిర్మాణాల కాంట్రాక్టర్  గత కొన్ని రోజులుగా వాగు వద్ద టిప్పర్లు, జేసీబీలను ఏర్పాటుచేసి రాత్రిపూట ఇసుకను లారీలు, ట్రాక్టర్లలో నింపుతున్నారు. నింపిన ఇసుకను కొద్దిదూరం తరలించి డంపు చేస్తున్నారు. అనంతరం ఉదయం నుంచి సాయంత్రం వరకు లారీలు, ట్రాక్టర్లలో ఇసుకను పోలీసుల పహారా మధ్య నాగర్‌కర్నూల్‌కు తరలిస్తున్నారు. ప్రతిరోజూ లారీలు, భూగర్భ జలాలు అడుగంటుతాయని, ఇసుకను తరలించొద్దంటూ అడ్డుకొంటున్నా.. తమ తీరును మార్చుకోవడంలేదంటూ రఘుపతిపేట గ్రామస్థులు, రైతులు.. పోలీసులు, గుత్తేదారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాల్టా చట్టం ప్రకారంగా తాగు, సాగునీటి వ్యవసాయ బోరుబావులు, రాహదారులకు 500 మీటర్ల దూరం వరకు ఇసుకను తరలించొద్దు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలించడం ఎంతవరకు సమంజసమని రఘుపతిపేట గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఇసుక తరలింపుతో భూగర్భజలాలు వట్టిపోయి సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నా.. ఎవరూ పట్టించుకోవడంలేదని ఆ గ్రామ సర్పంచి జంగారెడ్డి వాపోయారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10655
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author