డ్రెడ్జింగ్ కార్పొరేఫన్ ఉద్యోగులకు న్యాయం చేయచండి…

డ్రెడ్జింగ్ కార్పొరేఫన్ ఉద్యోగులకు న్యాయం చేయచండి…
December 06 17:58 2017
విశాఖపట్టణం,
మంత్రి నరేంద్ర మోదీని తాను ఇప్పటి వరకు ఏమీ అడగలేదని.. కానీ ఇప్పుడు డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ)కి న్యాయం చేయమని తొలిసారి ఆయన్ని అడుగున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. డీసీఐ ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ జనసేన పార్టీ తరఫున ప్రధానికి రాసిన లేఖను ఈ సందర్భంగా పవన్ చూపించారు. బుధవారం ఉదయం విశాఖపట్నం వచ్చిన ఆయన.. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం డీసీఐ ఉద్యోగుల సమాఖ్య ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. లాభాల బాటలో ఉన్న డీసీఐను ప్రైవేటు వ్యక్తులకు ఎలా ధారాదత్తం చేస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించారు. డీసీఐ ప్రైవేటీకరణ సమస్యను పరిష్కరించకుండా ముఖం చాటేస్తున్నారంటూ స్థానిక బీజేపీ ఎంపీ హరిబాబు, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌పై పవన్ మండిపడ్డారు.దేశంలో నష్టాల్లో ఉన్న పరిశ్రమలను అమ్ముకోచ్చని, దానికి ఎవరూ కాదనరని.. కానీ లాభల బాటలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం సరికాదని పవన్ కళ్యాణ్ అన్నారు. ‘ప్రభుత్వం చెప్పే సాకులేంటంటే.. డీసీఐ వాళ్లు బకాయిలు కట్టలేదు అంటున్నారు. కానీ ఇతర చాలా ప్రభుత్వ రంగ సంస్థలు దాదాపు డీసీఐకి బకాయి పడ్డాయి. ఆ సంస్థలన్నీ ఈ బకాయిలను డీసీఐకి కట్టాల్సి ఉన్నాయి. అలాంటిది దీన్ని సాకుగా చూపించి డీసీఐను ప్రైవేటీకరణ చేయడం సరికాదు. డీసీఐకు బకాయిపడిన సంస్థలన్నీ వెంటనే సొమ్మును చెల్లించాలి’ అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ సంస్థలో 500 మంది శాశ్వత, మరో 500 మంది తాత్కాలిక ఉద్యోగులు పనిచేస్తున్నారని పవన్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ డ్రెడ్జింగ్ కంపెనీల్లో ఒకటిగా డీసీఐ నిలిచిందని, అలాంటి కంపెనీని ప్రైవేటీకరణ చేయడం బాధాకరమన్నారు.తన ప్రసంగంలో భాగంగా విశాఖ బీజేపీ ఎంపీ హరిబాబు, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌‌కు పవన్ చురకలు అంటించారు. ‘లోకల్ ఎంపీ హరిబాబు, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ బాధ్యతలను తప్పించుకోవచ్చేమో.. కానీ నాకు బాధ్యత ఉంది. భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఇదే వైజాగ్‌లో మీ ముందుకు వచ్చి ఓట్లు అడిగాను. ప్రజల సమస్యలను ముందుకు తీసుకెళ్లాల్సివాళ్లు వదిలేశారు. కానీ నేను మీకు మాటిచ్చాను. నేను ఈ రోజు ఓట్లు వేయమని అడుగున్నాను. ఒక వేళ ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్లని పక్షంలో నేను ఏ పార్టీలకైతే సపోర్ట్ చేశానో.. ఏ అభ్యర్థుకైతే మద్దతు ఇచ్చానో వాళ్లను నిలదీయడానికి వెనకాడనని ఆనాడే చెప్పాను. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఈ రోజు మీ ముందుకు వచ్చాను’ అని పవన్ తెలిపారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10679
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author