ఈసారీ నిరాశే..

ఈసారీ నిరాశే..
December 06 20:05 2017
మహబూబ్ నగర్,
ట్రెజరీ ద్వారా వేతనాలు అందుతాయని వేయి కళ్లతో ఎదురుచూసిన అర్చక ఉద్యోగులకు ఈ నెల నిరాశే ఎదురయింది. కోశాగారం ద్వారా తమకు వేతనాలు చెల్లించాలంటూ అర్చక, ఉద్యోగులు దశలవారీ పోరాటాలు చేశారు. వారితో చర్చలు జరిపిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు డిసెంబరు 1వ తేదీ నుంచి ట్రెజరీ ద్వారా వేతనాలు అందిస్తామంటూ హామీ ఇచ్చింది. దీంతో ఇన్నాళ్లు అర్చక, ఉద్యోగులు ఈ రోజు కోసం ఎంతో ఆశగా ఎదురు చూశారు. దేవాదాయశాఖ ఉన్నతాధికారులు మాత్రం వివిధ రకాల కారణాలు చూపుతూ వేతనాలను పూర్తిస్థాయిలో చెల్లించలేకపోయారు. దీంతో అర్చక, ఉద్యోగులు నిరుత్సాహానికి గురయ్యారు.
ట్రెజరీ నుంచి వేతనాల చెల్లింపుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత నెల ప్రగతిభవన్‌లో రాష్ట్ర అర్చక, ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. వారికి వేతనాల చెల్లింపుపై చర్చించి, స్పష్టమైన హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా జీవోఆర్‌టీ- 577ను కూడా విడుదల చేశారు. ముఖ్యమంత్రి ప్రకటనతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 600 పైబడి ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని ఆశించారు. తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తారని తాత్కాలిక ఉద్యోగులు, రోజువారి కూలీలు సంబరపడ్డారు. 2015 పీఆర్సీ ప్రకారం వేతనాలు అందుతాయని అనుకుంటే.. దేవాదాయశాఖ అధికారులు కొందరికి మాత్రమే వేతనాలు ఖాతాల్లో జమ చేసి, పలువురికి నిలిపివేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 1,100 వరకు ఆలయాలు దేవాదాయ శాఖలో నమోదు అయ్యాయి. దీనిలో 6-ఎ పరిధిలో అలంపూర్‌ శక్తిపీఠం, మన్యంకొండ వేంకటేశ్వరస్వామి ఆలయం, కురుమూర్తిస్వామి, మైసిగండి, మద్దిమడుగు ఆంజనేయస్వామి, ­ర్కొండపేట, బీచుపల్లి, గంగాపూర్‌ చెన్నకేశవస్వామి, జమ్మిచేడు, నాయినోనిపల్లి మైసమ్మ ఆలయాలున్నాయి. అలాగే 6-బి పరిధిలో 17, 6- సి కింద 21 ఆలయాలు ఉన్నాయి. మిగతా ఆలయాలు శాఖపరంగా గుర్తించబడి వాటి పరిధిలో ఆస్తులతో ధూపదీపాలు సాగిస్తున్నారు. శాఖాపరంగా గుర్తించిన ఆలయాల్లో పనిచేస్తున్న అర్చక, ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని కొన్నేళ్లుగా ఎదురుచూశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని కూడా దేవాదాయ శాఖ అధికారులు పక్కన పెట్టడం సరికాదని అర్చక, ఉద్యోగులు విమర్శిస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10721
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
kcr
  Categories:
view more articles

About Article Author