గట్టెక్కిన లంక.. సిరీస్ భారత్ వశం

గట్టెక్కిన లంక.. సిరీస్ భారత్ వశం
December 06 21:39 2017
శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 1-0 తో కైవసం చేసుకుంది. ఢిల్లీ టెస్ట్ కూడా భారత్ గెలుస్తుందని అందరూ భావించినా.. శ్రీలంక బ్యాట్స్ మెన్ పోరాటం.., భారత బౌలర్లు, ఫీల్డర్ల వైఫల్యం మ్యాచ్ డ్రాగా ముగియడానికి దారితీసింది. చివరి రోజు భారత్ కేవలం రెండంటే రెండు వికెట్లు మాత్రమే తీయగలిగింది. లంక బ్యాట్స్ మన్ ధనంజయ డిసిల్వా (210 బంతుల్లో 119 రిటైర్డ్ హర్ట్‌: 15 ఫోర్లు, 1 సిక్స్) సమయోచిత ఇన్నింగ్స్ తో లంకను గట్టెక్కించాడు. మిడిల్ ఆర్డర్ లో రోషన్ డిసిల్వా (74 నాటౌట్‌), డిక్‌వెల్లా(44 నాటౌట్‌)లు కూడా వికెట్‌ను కోల్పోకుండా ఆడటంతో శ్రీలంక 103 ఓవర్లలో రెండో ఇన్నింగ్స్‌లో లంక స్కోరు 299/5 పరుగులు చేసింది. జడేజాకు మూడు, అశ్విన్‌, షమీలకు చెరో వికెట్‌ దక్కింది. మ్యాచ్ డ్రా కావడంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది. రెండు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఈనెల 10 నుంచి ప్రారంభం అవుతుంది. మ్యాచ్ లో 293 పరుగులు చేసిన విరాట్ కొహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. సిరీస్ లో రెండు డబుల్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీనే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10740
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author