ఖమ్మంలో ఆటోల డిజిటైలేషన్

ఖమ్మంలో ఆటోల డిజిటైలేషన్
December 07 13:10 2017
ఖమ్మం,
ఖమ్మం జిల్లాల్లో ఆటోల సమగ్ర వివరాలను కంప్యూటరీకరించే డి జిటలైజేషన్‌ ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఆటోల్లో ప్రయాణించే వారి భద్రతే ధ్యేయంగా.. ఆటోల డిజిటలైజేషన్‌ విధానం రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో చేపట్టారు. డిజిటలైజేషన్‌లో ప్రతి ఆటోకు సంబందించిన పూర్తివివరాలను నమోదు చేస్తారు. ఆటో యజమాని పేరు, డ్రైవర్‌పేరు, చిరునామా, డ్రైవింగ్‌ లైసెన్స్‌ నెంబరు, రోడ్‌ట్యాక్స్‌ చెల్లింపు, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ వివరాలతో పాటు ఆటోకు సంబందిత ఆర్టీఏ నెంబరు, పోలీస్‌ శాఖ కేటాయించిన నెంబరు, సమీప పోలీ్‌సస్టేషన్ల ఫోన్‌నెంబర్లు తదితర వివరాలను ఒక స్టిక్కర్‌లో ముద్రించి ఆటోకు అంటిస్తారు.ప్రత్యేక బార్‌కోడ్‌తో అన్ని వివరాలు ఒకేసారి తెలుసుకునే వీలుంది. ఈ విధానం కోసం గత నెల రోజులుగా డిజిటల్‌ నమోదు చేస్తున్నారు. నమోదు చేసిన వారికి డిజిటల్‌ పత్రాలను అందించే కార్యక్రమం జిల్లా పోలీస్‌ కమిషనర్‌ తప్సీర్‌ ఇక్బాల్‌ బుధవారం ఖమ్మంలో ప్రారంభించారు. రాత్రివేళల్లో ఆటోల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడడం, ప్రయాణికులను దోచుకోవడం, ప్రమాదాలకు పాల్పడి పారిపోవడం వంటి సంఘటనలు గతంలో జరిగాయి. అలాంటి వాటికి చెక్‌ పెట్టడంతో పాటు సరైన ధృవపత్రాలు లేకుండా ఆటోలు రోడ్డుపై ప్రయాణించే వీల్లేకుండా ఈ డిజిటలైజేషన్‌ విధానం తోడ్పడుతుంది
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10791
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author