ఏజెన్సీలో వానా కాలం చదువులు

ఏజెన్సీలో వానా కాలం చదువులు
December 07 13:16 2017
అదిలాబాద్.,
ఏజెన్సీలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటానికి చర్ల మండలమే ఉదాహరణ. ముగ్గురు విద్యార్థుకూ… ఒక్క ఉపాధ్యాయుడు…ఆరుగురు ఉపాధ్యాయులకూ… ఇద్దరు ఉపాధ్యాయులు, తొమ్మిది మంది పిల్లలకు ఇద్దరు టీచర్లు ఇదే తంతు మరి కొన్ని పాఠశాలల్లో కూడా ప్రహాసనంగా సాగుతోంది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోనికి రాగానే విద్యావ్యవస్థలో సమూల మార్పుల కోసం రేషనలైజేషన్ పద్దతిని అమలు చేస్తామని ప్రకటించింది. దీని ద్వారా ప్రతీ 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. కానీ సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ విద్యా రంగంలో సంస్కరణలు అమల్లోనికి రావడంలేదు. మండలంలోని లింగాల గ్రామంలో ఒక ఉపాధ్యాయునికి ముగ్గురు విద్యార్థులున్నారు. పాఠశాల భవనాన్ని చూస్తే ఏ క్షణం కూలుతుందో అర్థం కాదు. ప్రమాదం జరగక ముందే ప్రభుత్వం తగు భద్రతా చర్యలు తీసుకుంటే బాగుంటుందని గ్రామస్థులు కోరుతున్నారు. దేవానగరం గ్రామంలో ఇద్దరు ఉపాధ్యాయులకు ఆరుగురు విద్యార్థులు, కొత్తగట్ల గ్రామంలో ఇద్దరు ఉపాధ్యాయులకు తొమ్మిదిమంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మండలంలోని 48 ప్రాథమిక పాఠశాలలు, 14 ప్రాథమికోన్నత పాఠశాలలు, 14 ఐటిడిఏ పరిధిలోని గిరిజన పరిషత్ పాఠశాలలు, జిల్లా పరిషత్ హైస్కూల్లు 5, ఆశ్రమ పాఠశాలలు 2, కస్తూర్బా బాలికల విద్యాలయం ఒకటి ఉంది. ఇందులో 14 మండల పరిషత్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. రేషనలైజేషన్ పద్దతిని అమలు చేస్తే మండలంలో 15 పాఠశాలలు మూసేసే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యావ్యవస్థపై శ్రద్ద పెట్టి సంస్కరణలు చేపడితే వచ్చే విద్యాసంలో అయినా సమస్యల పరిష్కారం అవుతాయని ప్రజలు కోరుతున్నారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10794
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author