ట్రాఫికర్ కోసం… 180 కోట్లు

ట్రాఫికర్ కోసం… 180 కోట్లు
December 07 13:22 2017
హైద్రాబాద్,
విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హై దరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలు నిత్యకృత్యంగా ఉన్న రహదారులను గుర్తించింది హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ. వాటిని 2021 నాటికి సమగ్రంగా అభివృద్ధి పరచాలని ప్రణాళికలను సిద్దం చేసింది. అందుకయ్యే ఖర్చును కూడా రూ.180 కోట్లుగా అంచనావేసి సంబంధిత విభాగాలకు అప్పగించాలని నిర్ణయించింది. అందులో భా గంగా ఇటీవల జరిగిన సాంకేతిక సలహామండలి సమావేశం ముందుకు ప్రవేశపెట్టింది. మండలి కూడా అథారిటీ చేసిన ప్రతిపాదనతో ఏకీభవిస్తూ వాటిని త్వరగా ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దాలని సూచించినట్టు సమాచారం. నగరంలో ప్రధానంగా ట్రాఫిక్ నిర్వాహణా కారిడార్లుగా 40 రహదారులను మొత్తం 120 కి.మీ.లు పొడవుగా అభివృ ద్ధి పరచాలని అథారిటీ నిర్ణయించింది. ఈ కారిడార్లలో ట్రాఫిక్ సమస్య, వాహనాల రద్దీ విపరీతంగా ఉన్నదని, భవిష్యత్ కాలాన్ని దృష్టిలోపెట్టుకు ని, అందుకనుగుణంగా తీర్చిదిద్దాలని ప్రతిపాదిస్తున్నది హెచ్‌ఎండిఎ.ఈ ట్రాఫిక్ కారిడార్లలో రాకపోకలు సాగిస్తున్న వాహనాల సంఖ్యకు అనుకూలంగా రోడ్డును విస్తరించాలి. ఒక కారిడార్‌ను కనీసంగా 15 కి.మీ.లుగా తీసుకుని వాహనాల ప్రయాణానికి అనువుగా మెరుగుపరచాలి. పార్కింగ్ నియమనిబంధనలు తప్పనిసరిగా అమలు, నియంత్రణ జరిగేలా చూడాలి. వీధుల్లో పార్కింగ్, రోడ్డుకు దూరంగా పార్కింగ్ ప్రాంతాలను గుర్తించి అక్కడే వాహనాలు నిలిపేటట్టుగా ఏర్పాట్లు చేయ డం. ఈ రోడ్లలో ఉన్నటువంటి కూడళ్ళను అభివృద్ధి పరచాలి. పాదచారులు నడిచేందుకు అవసరమయ్యే ప్రదేశాన్ని వీలైనంత వరకు అందుబాటులోకి తీసుకురావాలి. వారికి సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పా ట్లు చేయాలి. ట్రాఫిక్ నియంత్రణ, నిబంధన ప్రమాణికాలను కార్యరూపంలో ఉండాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రాంతాన్నే వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా తీర్చిదిద్దడం. వాహనాలను పరిగణలోకి తీసుకుని చిన్నచిన్నగా రోడ్ల విస్తరణలు, బాటిల్‌నెక్‌లు నివారించడం, బస్ స్టాప్‌లను మరోచోట్లకు పంపించడం లేదా తరలించడం. కారిడార్ల పురోగతికి నమూనాను సిద్దం చేసింది హెచ్‌ఎండిఎ. ముందుగా వాహనాల రాకపోకలకు అంతరా యం కలగకుండా రహదారిని తీర్చిదిద్దడం. ఆ వెం టనే ఏదేని అత్యవసరం నిమిత్తం వినియోగించుకునేందుకు చిన్న స్థలం. అనంతరం సైకిల్ ట్రాక్‌లు, త ర్వాత పాదచారుల నడకదారి ఉండేట్టుగా కారిడార్లను అభివృద్ధి పరచాలి.గతంలోనూ… నగరంలో మెరుగుపరచాల్సినవి 7 ట్రాఫిక్ కారిడార్‌లను 15 కి.మీ.లుగా ఎంపికచేసి 2011లోనే తక్షణ కార్యాచరణ ప్రణాళికలో స్పష్టంచేసింది. అయితే, ఆరేళ్ళు గడిచినా అవి ఇప్పటి వరకు ముందగువేయలేదనే విమర్శలున్నాయి. ప్రస్తుతం గుర్తించిన కారిడార్లు మొత్తం 40. వీటి పొడవు 120 కి.మీ.లుగా నిర్ణయించారు. ప్రస్తుతం 2021 నాటికి వీటిల్లోని ట్రాఫిక్ సమస్యలను నివారించి, పాదచారులకు, సైకిల్ ట్రాక్‌లకు అవకాశం కల్పించాల్సి ఉన్నది. గతంలో 15 కి.మీ. లుగా ప్రతిపాదించిన ప్రణాళికను అమలు చేయని స ంబంధిత విభాగం ఈ మారు రూ. 180 కోట్లు వె చ్చి ంచి 40 కారిడార్లు, 120 కి.మీ.లుగా ఉన్న రహదారులను అభివృద్ధి పరస్తుందా..? లేదా..? వేచి చూడాలి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10800
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author