గోనె సంచులు మాయమవుతున్నాయ్…

గోనె సంచులు మాయమవుతున్నాయ్…
December 07 13:27 2017
నల్గొండ
ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకుల బాధ్యతారాహిత్యంతో సంఘాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ధాన్యం కొనుగోలు నిమిత్తం పౌరసరఫరాల శాఖ నుంచి తీసుకొన్న గోనె సంచుల లెక్కలను సక్రమంగా చూపించటం లేదు. లెక్కలు చూపని సంఘాలు బాధ్యత వహించాల్సిందేనని వారి నుంచి పౌరసరఫరాల శాఖ రూ. 3.38 కోట్లు వసూలు చేసింది.ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. కేంద్రాలను నిర్వహించిన సంఘాలకు కమీషను డబ్బులు ఇవ్వటంతో ఆర్థికంగా పరిపుష్టి అవుతాయి. అయితే కొన్ని సంఘాలు గోనెసంచుల గోలతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయి.ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభ సమయంలో పౌరసరఫరాల శాఖ గోనె సంచులను సరఫరా చేస్తోంది. కొనుగోలు ప్రక్రియ ముగిసిన అనంతరం సదరు సంఘాలు తిరిగి సంచుల లెక్కలు చూపించాలి. కానీ కొందరు సక్రమంగా చూపటం లేదు. వీరికి సరఫరా చేసిన దానికి తిరిగి అప్పగించిన దానికి లక్షల సంచులు తేడా వస్తోంది. దీంతో సంబంధిత శాఖ ఆ భారాన్ని సదరు సంఘాలపైనే మోపుతోంది. అలా పీఏసీఎస్‌లు, ఐకేపీ, మెప్మాల నుంచి రూ. 3.38 కోట్లు వసూలు చేసింది. అయితే సిబ్బంది పనితీరు సక్రమంగా లేకపోవటంతో ఈ నష్టం వాటిల్లుతుందని పలువురు అంటున్నారు.కొందరు సంచులను భద్రపరచటంలో నిర్లక్ష్యం చేస్తుండటంతో చోరీకి గురవుతున్నాయి. మరి కొందరు తమ బంధువులకు, తెలిసిన వారికి ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సంఘాలు కేంద్రాల నిర్వహణ సమయంలో అదనపు సిబ్బందిని నియమించుకొంటున్నా నష్టాన్ని నివారించలేకపోతున్నారు. దీంతో సంఘాలకు నష్టం వాటిల్లుతోంది.సంచుల లెక్కలు సక్రమంగా చూపకుంటే వారే బాధ్యత వహించాలని పౌరసరఫరాల శాఖ పలుమార్లు హెచ్చరించింది. అయినా కేంద్రాల నిర్వాహకులు స్పందించలేదు. సంచులను తిరిగి అప్పజెప్పడానికి సుమారు ఏడాది సమయం ఇచ్చారు. అయినా సిబ్బంది నిర్లక్ష్యాన్ని వీడలేదు. దీంతో ఆ శాఖ లెక్కలు సక్రమంగా చూపని సంఘాలు డబ్బులు చెల్లించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ధాన్యం కొనుగోలు చేసినందుకు గాను సంఘాలకు ఇచ్చే కమీషను డబ్బుల్లో సంచుల ఖరీదును మినహాయించుకొని మిగతా డబ్బులను సంఘాల ఖాతాల్లో జమ చేశారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10803
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author