ఆటోమొబైల్ హబ్ గా ఏపీ : చంద్రబాబు

ఆటోమొబైల్ హబ్ గా ఏపీ : చంద్రబాబు
December 07 14:55 2017
అమరావతి,
రాష్ట్రంలో  పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. గురువారం నాడు  మీడియా సమావేశంలో అయన  దక్షిణ కొరియా పర్యటన వివరాలు  వెల్లడించారు. గతంలో  దక్షిణ కొరియా పేద దేశమని, ఇప్పుడు దక్షిణకొరియా తిరుగులేని శక్తిగా తయారైందని చంద్రబాబు వివరించారు. సింగపూర్ తైవాన్ హొంకాంగ్ దక్షిణ కొరియా ల్లో. కొరియా బాగా అభివృద్ధి చెంది ఆసియ టైగర్ అయ్యింది.  దక్షిణ కొరియా కు మనకు చాలా విషయాల్లో సారూప్యత లు ఉన్నాయి. చాలా క్రమ శిక్షణ తో. దక్షిణ కొరియా పని   చేసిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
 అలాగే, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆటోమొబైల్ హబ్గా తయారవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రూ.5వేల కోట్ల పెట్టుబడులు ఏపీకి రానున్నాయన్నారు. స్టోరేజ్ బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులకు ఎల్జీ ఆసక్తి కనబరిచిందన్నారు. కీయ మోటార్స్ ఏపీ లో పెట్టుబడులకు  ముందుకు వచ్చారు. కీయ  మోటార్స్ 5000 కోట్లతో. పెట్టుబడులు పెడతారు. అనంతపురం లో కీయ మొటర్స్ సప్లయర్ ప్రారంభం అవుతుందని అయన వెల్లడించారు.  రాష్ట్రానికి 37 సంస్థలు రానున్నాయని తెలిపారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అధ్యక్షుడు సూన్ క్వోన్తో సమావేశమయ్యామన్నారు. ఎల్జీ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచిందన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10845
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author