అవకతవకలపై సమాధానం చెప్పాలి

అవకతవకలపై సమాధానం చెప్పాలి
December 07 18:44 2017
పోలవరం,
2018 సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టు పూర్తికావడం అసాధ్యమేనని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం నాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించి పనులను పరిశీలించిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. సెక్రటేరియేట్ కట్టలేనివాళ్లు పోలవరం ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. ప్రాజెక్టుపై సందేహాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు..  కేంద్రంతో ధైర్యంగా మాట్లాడి ప్రాజెక్టును పూర్తి చేద్దామని, అందుకోసం ఏపీ సర్కారుకు సహకరించాలని కేంద్రానికి తనవంతు విజ్ఞప్తి చేస్తానని పవన్ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు విషయంలో అవకతవకల ఆరోపణలు వచ్చాయని అన్న పవన్ అవకతవకలు చేయనప్పుడు శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వానికి సూచించారు. బీజేపీ అడిగిన దానికి సమాధానం చెప్పండి. అంతేగాని తిరిగి పొలవరాన్ని కేంద్రానికి అప్పజెప్పుతామనడం సరికాదని అన్నారు. నిర్వాసితుల బాధలు అర్ధమయ్యాయి. ప్రభుత్వం నిర్వాసితులకు న్యాయం చేయాలి. అఖిల ఫక్ష నాయకులతో కమిటీ వేయండని అన్నారు. 2019 ఎన్నికల్లో పోలవరం చాలా ప్రభావం చూపుతుంది.  పోలవరంపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పకుంటే ప్రజల్లో రాంగ్ సిగ్నల్స్ వెళ్తున్నాయని అయన అన్నారు. రాజమహేంద్రవరం నుంచి పోలవరం చేరుకున్న పవన్‌కు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం హిల్‌ వ్యూ నుంచి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. నిర్మాణ పనులు సాగుతున్న తీరును ఎస్‌ఈ వి.రమేష్‌బాబు ఆయనకు వివరించారు. స్పిల్‌వే, డయా ఫ్రంవాల్‌ నిర్మాణం, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం, నిర్మాణాల్లో ప్రగతిని ఇంజినీర్లు వివరించారు. పవన్‌ పర్యటన పురస్కరించుకొని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది భద్రతా ఏర్పాట్లు చేపట్టారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10897
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author