ఘనంగా తెలుగు మహాసభలు

ఘనంగా తెలుగు మహాసభలు
December 07 19:38 2017
హైద్రాబాద్,
తెలంగాణ ఔన్నత్యాన్ని చాటేవిధంగా ప్రపంచ తెలుగు మహా సభలు నిర్వ‌హిస్తామ‌ని అన్నారు ఉప ముఖ్యమంత్రి, కడియం శ్రీహరి…తెలంగాణ జీవన సౌందర్యాన్ని ప్రపంచానికి తెలియజేసేలా రెండున్నర కోట్ల రూపాయలతో డాక్యుమెంటరీని కూడా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ తెలుగు మహా సభల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ఏర్పాటైన సబ్ కమిటీ ఎల్.బి స్టేడియంలో సమీక్ష నిర్వహించారు..తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి తెలిసే విధంగా అన్ని ఏఏర్పాట్ల పై చర్చించారు కమిటీ నంబర్స్…ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే ప్రపంచ తెలుగు మహా సభలు హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించి, ఈ నిర్వహణ కోసం సిఎం కేసిఆర్ కోర్ కమిటీని కూడా నియమించారని గుర్తు చేశారు కడియం..  దీంతో పాటు వచ్చే అతిథుల కోసం, సభా నిర్వహణ, వేదిక, అలంకరణ, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల కోసం కూడా వివిధ కమిటీలు ఏర్పాటు కావడంతో పాటు పని కూడా మొదలు పెట్టాయని అన్నారు.ఈ కమిటీలకు ఇప్పటికే వాటి బాధ్యతలు, జాబ్ చార్ట్, మైక్రో లెవల్ ప్లానింగ్ కూడా ఉన్నాయన్నారు. తెలుగు మహాసభల కోసం ఇప్పటికే సిఎం కేసిఆర్ 50 కోట్ల రూపాయలను మంజూరు చేశారన్నారు. ఈ నిధులు వేదికల ఏర్పాటు, అలంకరణ, అతిధుల వసతులు, సౌకర్యాల కోసం ఖర్చుచేస్తున్నామన్నారు. ఈ నెల 7వ తేదీన సచివాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు మరోసారి సమావేశమై ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లను మరింత లోతుగా సమీక్షిస్తామని తెలిపారు..కేసిఆర్ ఆశించినట్లు తెలంగాణ జీవన విధానాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా, ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ సభలు విజయవంతం అయ్యేలా పనిచేస్తున్నామని, దీనికి అందరూ సహకరించాలని కోరారు…
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10915
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author