ప్రాజెక్టుల సత్వర పూర్తే సర్కార్ లక్ష్యం

 ప్రాజెక్టుల సత్వర పూర్తే సర్కార్ లక్ష్యం
December 07 20:35 2017
వరంగల్,
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సాగునీరు అందించడానికి తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులు సత్వరం పూర్తి  చేయడమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. బ్యారేజీలు, పంప్ హౌజ్ లు, కాలువల నిర్మాణం, ఏక కాలంలో  మూడు షిప్టుల్లో పనులు జరగాలని అధికారులను, వర్క్  ఏజెన్సీ లను సిఎం ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను సందర్శించి పనులను పరిశీలించారు. ఉదయం ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి  రెండు హెలిక్యాప్టర్లలో బయలుదేరిన ముఖ్యమంత్రి తుపాకుల గూడెం బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌజ్, అన్నారం బ్యారేజ్,  సిరిపురం పంప్ హజ్ లను మధ్యహ్నం వరకు సందర్శించారు. ఈ సందర్భంగా పనులు జరుగుతున్న తీరును అధికారులను, వర్క్ ఏజెన్సీ లను అడిగి తెలుసుకున్నారు .
ప్రాజెక్ట్ ల నిర్మాణానికి ఎలాంటి సహకారాన్నైనా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం పేర్కొన్నారు. తుపాకుల గుడెం వద్ద గోదావరి వరద ప్రవాహం గురించి అధికారులను అడిగారు.  ప్రస్తుతం 6వేల క్యూ సెక్కుల వరద ప్రవాహం ఉందని అధికారులు వివరించారు. 1132 మీటర్ల కాపర్ డ్యాం నిర్మాణం దాదాపుగా పూర్తి కావొచ్చిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మరో 150 మీటర్లు పూర్తి అయితే మొత్తం కాపర్ డ్యాం నిర్మాణం పూర్తి అవుతుందని అధికారులు వివరించారు. పక్క రాష్ట్రాల అధికారులతో పోలీస్ శాఖకు సంబంధించి ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడాలని  డీ.జి.పి మహేందర్ రెడ్డికి సూచించారు. డ్రోన్ కెమెరాలతో కూడా ప్రాజెక్ట్ ల పనులను పర్యవేక్షిస్తూ భద్రత పరంగా చర్యలు తీసుకుంటున్నట్టు డీ.జి.పి  మహేందర్ రెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. ప్రాజెక్టులకు అవసరమైన రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సిఎం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రాజెక్ట్ లు పూర్తి చేయడమే చాలా ముఖ్యమైన కార్యక్రమం అని ఈ విషయాన్ని అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ లు గమనంలో ఉంచుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు..
ఈ కార్యక్రమంలో మంత్రులు  హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఎంపిలు పి. వినోద్ కుమార్, బాల్క సుమన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి సింగ్, డి.జి.పి మహేందర్ రెడ్డి, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి,  జెన్కో సి.ఎం.డి. ప్రభాకర్ రావు, భూపాల పల్లి జిల్లా కలెక్టర్ మురళి, నీటి పారుదల శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10961
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author