girl searching for public toilets in swachh bharat country

December 08 08:14 2017

ఈ వీడియోని షేర్ చేసి ప్రభుత్వాన్ని నిద్ర లేపండి. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అంటారు …కనీసం ఉ** పోయడానికి రెండు మూడు కిలోమీటర్లకి ఒక టాయిలెట్ ని నిర్మించరు ….
సిటీకి ఎన్నో పనుల మీద రోజుకు లక్షల మంది వస్తుంటారు … అందులో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సమస్యే ఇది ..ఆడైనా మగైనా ) …

మగాడు తట్టుకోలేక పదిమందిలో స్థంభం పక్కనైనా కానిచ్చేస్తాడు మరి ఆడవాళ్ళ పరిస్తితి ఏంటని ఒక్కరూ ఆలోచించరు …

తినడానికి తిండి అడగడం లేదు తాగడానికి నీళ్ళు అడగడం లేదు ..కనీసం మలమూత్రాల కోసం చిన్న చోటు కట్టించలేని దౌర్భాగ్య స్థితిలో మన ప్రభుత్వాలు ఉన్నాయి …

ఈమధ్య ఆపుకోలేక రోడ్డు పక్కన పోస్తుంటే ఏదో దేశ ద్రోహం చేస్తున్న వాడిలా దండేసి దండం పెట్టి ఫోటోలు తీస్తున్నారు మునిసిపాలిటీ పెద్దలు …అయ్యా పెద్దలారా ..ముందు టాయిలెట్లు కట్టించి తర్వాత ఫోటోలు తీయండయ్యా …

ఎవరూ కావాలని సిగ్గు విడిచి పదిమందిలో మూత్ర విసర్జన చేయరు … తప్పక, తప్పనిసరి పరిస్తితిలో చేస్తారు ….

కాస్త ఆలోచించండి … ఈ వీడియోని షేర్ చేసి ప్రభుత్వాన్ని నిద్ర లేపండి.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10968
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author