జగన్ కు లోకేష్ కౌంటర్లు

 జగన్ కు లోకేష్ కౌంటర్లు
December 08 15:46 2017
విజయవాడ,
తమ కుటుంబ ఆస్తులను ప్రకటించిన నారా లోకేష్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు చురకలు అంటించారు. పవన్ కల్యాణ్ గురించి సానుకూలంగా మాట్లాడుతూనే.. గురువారం ఆయన చేసిన వారసత్వ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. పోలవరం నిర్మాణానికి సమయం పడుతుంది కాబట్టే పట్టిసీమ కట్టామని చెప్పిన ఆయన.. యుద్ధ ప్రతిపాదికన పోలవరం నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. ఇప్పుడు పోలవరం గురించి మాట్లాడుతున్న ప్రతిపక్షం.. గతంలో వాళ్ల నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని ఎందుకు ప్రారంభించలేదో చెప్పాలన్నారు. పనులు వేగంగా జరుగుతున్నాయని లోకేష్ తెలిపారు.
పవన్ కల్యాణ్ ప్రాజెక్ట్ పూర్తి కావాలని కోరుకుంటున్నారు. కానీ జగన్, వైకాపా మాత్రం ప్రాజెక్ట్ పూర్తి కావద్దని కోరుకుంటున్నారని లోకేష్ చెప్పారు. ఇద్దరి మధ్యా తేడా గుర్తించాలన్నారు. గతంలో పట్టిసీమ నిర్మాణం సమయంలోనూ విపక్ష నేతలు ఇలాగే వ్యవహరించారన్నారు. చేసి చూపించే సత్తా తెలుగుదేశం ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రతిపక్షం విమర్శలు తప్ప ఏమి చేయలేదన్నారు. ఏపీలో ప్రతిపక్షం మేమే, అధికారపక్షం మేమే అని చెప్పారు. అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టి, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని వైకాపా డిమాండ్ చేయడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు.రాజకీయాల్లోకి వారసులు వస్తున్నారని గురువారం వ్యాఖ్యానించిన పవన్.. సీఎం తనయుడు సీఎం కావాలా అని జగన్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. అదే సమయంలో లోకేష్ ప్రస్తావన తీసుకురాగా.. ఆయన సామర్థ్యం వాళ్ల నాన్న చంద్రబాబుకే బాగా తెలుసని తెలిపారు. దీనిపై లోకేష్ కౌంటర్ ఇచ్చారు.వారసుల్ని చూసి జనాలు ఓటేయరు. ప్రజల పక్షాన ఉన్న వారికే ఓటేస్తారని లోకేష్ స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వారసులు వచ్చిన మాట నిజమే. కానీ ప్రజామోదం ఉంటేనే ఆ వారసులు కూడా నిలబడతారు. తాను కూడా అలాగే నిలబడతానని బదులిచ్చిన లోకేష్ పవన్‌ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11109
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author