స్వచ్ఛ ఆటోల ద్వారా తడి, పొడి చెత్త వేర్వేరు

స్వచ్ఛ ఆటోల ద్వారా తడి, పొడి చెత్త వేర్వేరు
December 08 19:54 2017
హైదరాబాద్,
స్వచ్ఛ హైదరాబాద్  లో భాగంగా నగరంలో చెత్త తరలింపుకు ప్రవేశపెట్టిన రెండు వేల ఆటో  టిప్పర్ల ద్వారా వంద శాతం తడి, పొడి చెత్తగా వేరుచేసి ట్రాన్స్ఫర్ స్టేషన్లకు తరలించే ప్రక్రియపై జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. ఇప్పటికే ఇంటింటి నుండి తడి, పొడి చెత్తను వేరుచేసి స్వచ్ఛ ఆటోలకు అందించడానికి 44లక్షల డస్ట్బిన్లను పంపిణీచేశారు. అయినప్పటికీ ఇంటి వద్దే తడి, పొడి చెత్తను వేరు చేయకుండా కలిపి స్వచ్ఛ ఆటోలకు అందిస్తున్నందున ఆటో స్థాయిలోనే చెత్తను తడి, పొడి చెత్తగా వేరుచేసి తరలించాలని ఆటోడ్రైవర్లకు స్పష్టమైన కౌన్సిలింగ్ ఆదేశాలను జీహెచ్ఎంసీ అధికారులు జారీచేశారు. దీంతో చెత్త ద్వారా వచ్చే ప్లాస్టిక్, ఇనుము తదితర లోహాలను వేర్వేరు చేసి విక్రయించడం ద్వారా స్వచ్ఛ ఆటోడ్రైవర్లు అదనపు ఆదాయం పొందుతున్నారు. వీటితో పాటు ఆటోలలో ఏర్పాటుచేసిన పార్టీషన్లలో తడి చెత్తను పొడిచెత్తను వేర్వేరుగా సేకరించి తరలిస్తున్నారు. నగరంలో మొత్తం 2వేల ఆటోలు చెత్తను సేకరిస్తుండగా వీటిలో రాజేంద్రనగర్, ముషిరాబాద్, మల్కాజ్గిరి సర్కిళ్లలో 90శాతానికిపైగా స్వచ్ఛ ఆటోలు తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసి ట్రాన్స్ఫర్ స్టేషన్లకు పంపిస్తున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్లో అత్యధికంగా 98.27శాతం చెత్తను వేర్వేరు చేస్తుండగా అతితక్కవుగా ఎల్బీనగర్ సర్కిల్లో కేవలం 15శాతం మాత్రమే వేరు చేస్తున్నారు. ముషిరాబాద్ సర్కిల్లో 92.56శాతం, మల్కాజ్గిరి సర్కిల్లో 90.53శాతం చెత్తను వేర్వేరుచేసి తరలిస్తుండగా హయత్నగర్, సరూర్నగర్, మెహిదీపట్నం సర్కిళ్లలో అతితక్కువ మొత్తంలో చెత్తను వేర్వేరు చేస్తున్నారు. కాగా చెత్తను తడి, పొడి చెత్తగా వేర్వేరు చేసి తరలించే స్వచ్ఛ డ్రైవర్లను గుర్తించి ప్రతివారం సన్మానించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్రెడ్డి ఆదేశాలు జారీచేశారు. వీటితో పాటు ప్రతి ట్రాన్స్ఫర్ స్టేషన్ వద్ద తడి, పొడి చెత్తను వేర్వేరు తెచ్చే వాహనాల సంఖ్యను పేర్కొనే బోర్డు, ట్రాన్స్ఫర్ స్టేషన్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసే ప్రాంతాల వద్ద బోర్డులను విధిగా ప్రదర్శించాలని కమిషనర్ స్పష్టం చేశారు. చెత్తలో 75శాతం తిరిగి ఉపయోగపడుతుందన్న అంశాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కమిషనర్ పేర్కొన్నారు. ప్రతి స్వచ్ఛ ఆటో పూర్తిస్థాయిలో పనిచేసే అంశంపై సమీక్షించాలని సుదీర్ఘకాలంగా ఆటోలు నడపని డ్రైవర్ల నుండి ఆటోలను స్వాధీనపర్చుకోవాలని కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 2వేల స్వచ్ఛ ఆటోలకు తోడు మరో 500 స్వచ్ఛ ఆటోలను రెండు నెలల్లోగా నగరంలో ప్రవేశపెట్టనున్నట్టు కమిషనర్ పేర్కొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11144
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author