ఎన్టీపీసీ నిర్మాణం వేగవంతం : సీఎం

ఎన్టీపీసీ నిర్మాణం వేగవంతం : సీఎం
December 08 21:09 2017
రామగుండం,
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు రామగుండంలోని ఎన్.టి.పి.సి. పవర్ ప్లాంట్ ను శుక్రవారం ఉదయం సందర్శించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్.టి.పి.సి ఆధ్వర్యంలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించాల్సి ఉంది. అందులో భాగంగా మొదటి విడత 1600 మెగావాట్ల (2×800) సామర్థ్యం కలిగిన యూనిట్ల నిర్మాణం ప్రారంభమయ్యింది. ఈ పనులను ముఖ్యమంత్రి కెసిఆర్ పరిశీలించారు. 2020 మే నాటికి మొదటి యూనిట్ ను ఆ తర్వాత మరో ఆరు నెలలకు రెండో యూనిట్ ను పూర్తి చేస్తామని ఎన్.టి.పి.సి ఎక్జిక్యూటివ్ డైరక్టర్ దూబే సిఎంకు చెప్పారు. నిర్మాణంలో వేగం పెంచాలని, నిర్దేశిత లక్ష్యం లోగానే పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి బిహెచ్ఇఎల్ అధికారులను కోరారు. తెలంగాణ రాష్ర్టంలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఇతర అవసరాలు కూడా కలిగి ఉన్నందున సాధ్యమైనంత త్వరలో విద్యుత్ అందించాలని కోరారు. విద్యుత్ ప్లాంటుల నిర్మాణం, తెలంగాణ విద్యుత్ సంస్థలతో అనుసంధానం తదితర అంశాలను జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు సిఎంకు వివరించారు. ప్లాంటు నిర్మాణం, నిర్వహణకు అవసరమైన నీరు అందించటంతో పాటు ఇతర సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కెసిఆర్ చెప్పారు. అన్ని పనులు సమాంతరంగా, పటిష్టంగా చేపట్టి.. సకాలంలో పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. పనులను పరిశీలించే సందర్భంగా అధికారులు, ఇంజనీర్లు, వర్క్ ఏజెన్సీలతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. నిర్మాణాలపై వారికి కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు.
కన్నెపల్లి దగ్గర నీటి పంపింగ్ జరిగిన తర్వాత అన్నారం, సుందిళ్ల ద్వారా మేడారం వరకు చేరే నీటిని 105 మీటర్ల మేర లిఫ్ట్ చేయడం అత్యంత ముఖ్యమైన ఘట్టమని సీఎం కేసీఆర్ చెప్పారు. వేసవిలోగా అన్ని పనులు పూర్తి చేసి నీటి లిఫ్ట్‌కు, పంపింగ్‌కు సిద్ధం కావాలన్నారు. మేడారం నుంచి రామడుగు వరకు జరుగుతున్న పనులను కూడా సీఎం కేసీఆర్ పరిశీలించారు. మంత్రి హరీష్ రావు, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్, సీఈ వెంకటేశ్వర్లు పనుల పురోగతిని సీఎంకు వివరించారు. మేడారం నుంచి లక్ష్మీపూర్ వరకు 15 కిలోమీటర్ల టన్నెల్‌ను, 5.7 కిలోమీటర్ల కెనాల్‌ను సీఎం కేసీఆర్ పరిశీలించారు. లక్ష్మీపూర్ దగ్గర పంప్‌హౌస్‌ను పరిశీలించారు. లక్ష్మీపూర్ దగ్గర నీటిని లిఫ్ట్ చేయడానికి 139 మెగావాట్ల సామర్థ్యం గల ఏడు పంపులు ఏర్పాటు చేస్తున్నామని.. వాటిని నడిపించడానికి అవసరమైన 973 మెగావాట్ల విద్యుత్ అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు సీఎండీ ప్రభాకర్ రావు ముఖ్యమంత్రికి వివరించారు. బీహెచ్ఈఎల్ అధికారులతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. మొత్తం ఏడు పంపులకు గాను వచ్చే జూన్‌ లోగా రెండు పంపులను బిగిస్తామని, మిగతావి డిసెంబర్ నాటికి అందిస్తామని బీహెచ్‌ఈఎల్‌ జీఎం సుందరరాజన్‌ సీఎంకు తెలిపారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11183
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author