ధాన్యం కొనుగోళ్ల సమస్యలకు వాట్సప్ చెక్ 

ధాన్యం కొనుగోళ్ల సమస్యలకు వాట్సప్ చెక్ 
December 09 14:11 2017
నిజామాబాద్
ధాన్యం కొనుగోళ్లలో ఎదురయ్యే ఇబ్బందులు, సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం జేసీ సీహెచ్.శివలింగయ్య ప్రత్యేకంగా ఒక వాట్సప్ గ్రూపును ఏర్పాటు చేశారు. ఇందులో జేసీతో పాటు డీఎస్‌వో, సివిల్‌సప్లయ్ డీఏం, డీసీవో, డీసీఎంఎస్ అధికారులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్లు సభ్యులుగా ఉన్నారు. ఈ సభ్యులు ప్రతిరోజు కనీసం ఐదు కొనుగోలు కేంద్రాలను తప్పని సరిగా పరిశీలిస్తున్నారు. ఏరోజుకారోజు క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఈ గ్రూపులో అప్‌లోడ్ చేస్తున్నా రు. సదరు కొనుగోలు కేంద్రం పరిధిలో ధాన్యం దిగుబడి..విక్రయానికి వచ్చింది.. ఇంకా మిగిలిన సరుకు.. వంటి వివరాలు, కొనుగోళ్లలో, రవాణాలో ఉన్న ఇబ్బందులను తెలుసుకొని ఈ గ్రూపులో అప్‌లోడ్ చేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయి పరిస్థితి ఉన్నతాధికారుల వరకు ఎప్పటికప్పుడు తెలిసిపోతోంది. దీంతో సమస్యలను వెనువెంటనే పరిష్కరించే అవకాశం ఉంటుంది. ఈ గ్రూపుతో వివిధ శాఖల మధ్య సమన్వయం పెరుగుతోంది.వానాకాలం సీజన్‌లో 14,382హెక్టార్లలో వరి పంటను సాగు చేశారు. సుమారు 64,719 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కోసం అధికారులు 115కొనుగోలు కేంద్రాలు ఏ ర్పాటు చేశారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో 74 కేంద్రాలు, డీసీఎంఎస్ 31 కేంద్రాలు, ఐటీడీఏ ఆధ్వర్యంలో 6 కేంద్రాలు, డీఆర్‌డీఏ – ఐకేపీ ఆ ధ్వర్యంలో 4 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 20 17-18 సీజన్‌కు ఎ గ్రేడ్ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.1590 చొప్పున, బి గ్రేడ్ (సాధారణం) రకానికి క్వింటాకు రూ.1550చొప్పున చెల్లిస్తున్నారు. గతంలో ఐకేపీ ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో కేంద్రాలు ఏర్పాటు చేయగా.. సెర్ప్ సిబ్బంది సమ్మెలో ఉండడంతో ఈ కేంద్రాలను పీఏసీఎస్, డీసీఎంఎస్‌లకు కేటాయించారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యం కొంటున్నారు. మొత్తం 50లక్షల వరకు గన్నీ బ్యాగులు అవసరముండగా.. ఇప్పటికే 20లక్షల గన్నీ బ్యాగులు సరఫరా చేశారు. మిగతావి కూడా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 32,891 మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయానికి వచ్చింది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములు, రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు. ఇందులో 32వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి తరలించారు. ఇక ఇప్పటికే సగం ధాన్యం మార్కెట్‌కు విక్రయానికి రాగా.. మిగతా ధాన్యం 15 రోజుల్లో రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకరానున్నారు. ధాన్యంలో తేమ శాతం పరిశీలన కోసం 74 మాయిశ్చర్ మీటర్లు, ధా న్యంలో చెత్త చెదారం ఏరేసేందుకుగాను 65ప్యాడీ క్లీనర్లు, అకాల వర్షాలు సంభవిస్తే కప్పేందుకుగాను 2223 టార్పాలిన్లు అందుబాటులో ఉం చారు. ఇప్పటివరకు సుమారు రూ. 50.29 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో సుమారు 25 కోట్ల వరకు రైతులకు చెల్లించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు ట్యాబ్‌లో నమోదు చేస్తున్నారు. రైతుల బ్యాంకు ఖాతా నెంబర్లు నమోదు చేసిన మూడు రోజుల్లో డబ్బులు జమవుతున్నాయి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11261
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author