కైలాసగిరిలో పులి సంచారం 

కైలాసగిరిలో పులి సంచారం 
December 09 15:41 2017
విశాఖపట్నం,
విశాఖ కైలాసగిరిపై పులులు సంచరిస్తున్నాయన్న వార్తలు హడలెత్తిస్తున్నాయి. అయితే రాత్రి వెళ్లల్లో మాత్రమే వస్తున్నాయా అన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు అదికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. కైలాసగిరిపై పులులు వస్తున్నాయని సమాచారం అందుకున్న మంత్రి గంటా శ్రీనివాసరావు కైలాసాగిరిని సందర్శించారు. కైలాసగిరిపై పులులు కనిపించినట్లు అక్కడున్న కొంత మంది సిబ్బంది చూసి చెప్పినట్లు తెలిపారు. అయితే అవి పులులా కాదా అన్న విషయం ఇంకా పూర్తిగా నిర్ధారించలేదని అన్నారు. అక్కడ కనిపించిన కొన్ని ఆనవాళ్లు ఆధారంగా వాటి జాడ కనుకుంటున్నట్లు తెలిపారు. విశాఖలో గతంలో కూడా పులులు జనవాసాల్లోకి రావడంతో అధికారులు తీవ్రంగా అన్వేషిస్తున్నారు. కైలాసాగిరిపై నైట్ కెమెరాలు కూడా పెట్టి పూర్తిగా అన్వేషిస్తున్నట్లు తెలిపారు. పూర్తిగా అన్వేషించి ఒక నిర్ధారణకు వచ్చిన వరకు ప్రజలను కైలాసగిరి సందర్శనకు అనుమతించట్లేదని పేర్కొన్నారు.
అయితే కొండపై అటవీ ప్రాంతం కూడా ఉండడం కాస్తా అనుమానాలకు తావిస్తోంది. గతంలో ఎక్కడా కూడా లేని విధంగా పులులు వచ్చి సంతరిస్తున్నాయనే అనుమానాలకు బలం చేకూలర్చేలా అడుగు గుర్తులు ఉండడం అధికారులను కూడా హైరానాకు గురి చేస్తోంది. అయితే కైలాసగిరికి పర్యాటకులు వెళ్లేందుకు అనుమతించని అధికారులు పులులు జాడను గుర్తించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11276
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author