బ్లేమ్ గేమ్ మానుకోవాలి

బ్లేమ్ గేమ్ మానుకోవాలి
December 09 15:55 2017
ఒంగోలు
ఒంగోలులో ఫెర్రీ బోటు బాధిత కుటుంబాల్ని పవన్ కల్యాణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా.. లండన్లో తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. ‘ఒకబ్బాయి లండన్లో అడిగాడు.. మీరు టీడీపీ, బీజేపీకి మద్దతు ఇచ్చారు కదా. ప్రమాదానికి కారణం మీరు కాదా?’ అని ప్రశ్నించాడు. దీంతో నా తప్పిదం లేకపోయినా.. బాధనిపించింది. కోపం వచ్చింది. ప్రభుత్వాల వైఫల్యం నీ తప్పు కాదా అని ప్రశ్నించారు. మీ ఆత్మీయులు మరణం వెనుక పరోక్షంగా నా పాత్ర కూడా ఉంది. కాబట్టి మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటున్నా అని పవన్ తెలిపారు.మిమ్మల్ని పరామర్శించడానికి రావడం నిజంగా దురదృష్టం. ఇలాంటి సంఘటన పట్ల నాకు బాధగా ఉంది. విదేశాల్లో ఉండటం వల్ల రావడం ఆలస్యమైంది. క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని పవన్ బాధిత కుటుంబాలను ఉద్దేశించి మాట్లాడారు. బాధలో ఉన్నప్పుడు సాటి మనిషి స్పర్శ ధైర్యాన్ని ఇస్తుంది. మీ బాధను ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.మన దేశంలో ముందస్తు జాగ్రత్తలను తుంగలో తొక్కుతున్నారు. అధికారులు నిజాయతీగా ఉన్నా.. ఓట్ల కోసం రాజకీయ నాయకులు వాటిని పక్కనబెడుతున్నారు. ఎక్స్‌గ్రేషియా కంటితుడుపు చర్యే. దాని వల్ల ప్రాణలు తిరిగిరావు. రూ.5 లక్షలు ఖర్చుపెట్టి లైఫ్ జాకెట్లు కొంటే ఇంత ఖర్చు, ఆవేదనా ఉండవు. అడిగేవాళ్లు ఎవరూ ఉండరంటే తప్పు. యువతరం బాధ్యతతో కూడిన రాజకీయాలు కోరుకుంటోంది. ఈ కన్నీటిని ఎవరూ మర్చిపోవద్దు. మానవత్వం లేకుండా ప్రజాసమస్యలపై ఎలా పోరాడగలరు. ప్రతిపక్షం అసెంబ్లీలో ఉంటే నిలదీయొచ్చు. బ్లేమ్ గేమ్‌లో మానవత్వాన్ని మంటగలుపుతున్నారు. మీకు కన్నీరొస్తే.. నాకూ ఏడుపొస్తుంది. నేను కేవలం నటుణ్ని కాదని పవన్ ఉద్వేగంగా మాట్లాడారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11285
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author