రాజీనామాకు సిద్ధమంటున్న గోపిరెడ్డి

రాజీనామాకు సిద్ధమంటున్న గోపిరెడ్డి
December 09 15:58 2017
గుంటూరు,
గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే, వైకాపా నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సరికొత్త సవాల్ చేశారు. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాదికి పూర్తి చేస్తే, తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. అంతే కాదు…లగడపాటి రాజగోపాల్ లా తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పారు. తన సవాల్ ను ప్రభుత్వం స్వీకరిస్తుందా అని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు తెచ్చింది. కాలువలు తవ్వించింది వైఎస్ అని చెప్పారాయన. వైఎస్ కాలంలోనే కాలువలు తవ్వించారు. కాబట్టే ఈ రోజు పట్టిసీమ నుంచి నీళ్లొస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ మూడేళ్లలో పోలవరంపై టీడీపీ ప్రభుత్వం చేసిందేమి లేదని ఎమ్మెల్యే గోపిరెడ్డి ఎద్దేవా చేశారు. వందల కోట్ల రూపాయల నిధులు తెచ్చి ఖర్చు పెట్టింది నరసరావుపేట ఎమ్మెల్యేకు కనపడలేదనుకుంటా. ప్రతి సోమవారం పోలవరం పై సమీక్ష చేస్తుంది తెలియడంలేదు. అందుకే అసలు టీడీపీ ఏం చేయలేదని చెప్పడం  ఆశ్చర్యంగానే ఉంది. రాజకీయ నేతలు అన్నాక విమర్శలు సహజమే. కానీ ఇలా నేల విడిచి సాము చేసేలా విమర్శలు ఏంటనే చర్చ లేకపోలేదు. టీడీపీ ఏం చేయలేదనే కంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల పై ఒత్తిడి తెస్తే పోలవరం పూర్తి అవుతుందని గ్రహించాలంటున్నారు ఇంకోవైపు తెలుగు తమ్ముళ్లు.
గతంలో స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు, ఆయన కుమారుడు పై అవినీతి ఆరోపణలు చేసిన నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి వాటిలో ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారు. ఇప్పుడు మరోసారి చంద్రబాబు సర్కార్ పై రాజీనామా సవాల్ విసరడం ప్రచారం కోసమే అన్న వాదన వస్తోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11288
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author