దూకుడు పెంచిన కోదండరామ్

దూకుడు పెంచిన కోదండరామ్
December 09 16:02 2017
హైద్రాబాద్,
తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ఈ మధ్య దూకుడు పెంచారు. ప్రజా సంఘాలు, కేసీఆర్ వైరి వర్గం ఆయనతో జత కలిసింది. ఫలితంగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన ‘కొలువుల కొట్లాట’ సభ స‌క్సెస్ అయింది. సభకు రాకుండా నేతలను అడ్డుకునే పని చేసినా బాగానే వచ్చారు నిరుద్యోగులు. బలవంతంగా ఉద్యమాన్ని అణచాలనుకుంటే కుదిరే పని కాదని కేసీఆర్ టీమ్ కు అర్థమైంది. అందుకే ఇప్పుడు కేసీఆర్ సరికొత్త ఆలోచన చేశారనే ప్రచారం వస్తోంది. కోదండ‌రామ్ నేతృత్వంలోని జేఏసీలో తన వర్గం నేతలను రంగంలోకి దించారనే చర్చ సాగుతోంది. అవసరమైతే వారు కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడి ఆర్థిక సాయాన్ని అందిస్తారట. తమతో పాటు..మిగతా వారు ఎవరు ఆర్థికంగా సహకిరిస్తున్నారో తెలుసుకోవడమే వారి లక్ష్యమట. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అక్కడ జరిగే సంగతులను ఎప్పటికప్పడు చెప్పడమే కాదు..తాను జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి ఇంటిలిజెన్స్ వర్గాలు ఎలా సమాచారం అందిస్తాయో అలా కోదండరామ్ కు సంబంధించిన విశేషాలను ఆయన చెప్పేస్తున్నట్లు జేఏసీ వర్గాలు అనుకుంటున్నాయి. అందుకే ఎవరికి వారే అప్రమత్తంగా ఉన్నారట. కోదండరామ్ కూడ ఇదే అనుమానం వ్యక్తం చేశారని సమాచారం. ఇంకోవైపు కోదండరామ్ కు ఆర్థికంగా సాయం చేసే వారి వివరాలను కేసీఆర్ సేకరిస్తున్నారని తెలుస్తోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11291
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author