టీటీడీపై వైపు ఇతర పార్టీ నేతలు

టీటీడీపై వైపు ఇతర పార్టీ నేతలు
December 09 16:06 2017
హైద్రాబాద్,
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు తెలంగాణ టీడీపీ నేతలను ఆలోచనలో పడేశాయి. మన పార్టీ నుంచి నేతలు వలస పోవడం కాదు..మిగతా పార్టీల నుంచి టీడీపీకి వస్తామంటున్నారని చెప్పారాయన. తెలంగాణ టీడీపీలో ఇద్దరు ఎమ్మెల్యేలు తప్ప మిగతా నేతలంతా వలసపోయిన సంగతి తెలిసిందే. క్యాడర్ బలంగా ఉన్నా..నేతలు పార్టీ మారారు. ఫలితంగా పార్టీ కార్యకర్తలు నిరాశలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే టీడీపీలోకి వచ్చేందుకు కొందరు నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ నేతలతో అదే విషయం చెప్పారు. త్వరలోనే కొందరు నాయకులు మన పార్టీలో చేరతారని ప్రస్తావించారు. మన పార్టీలో చేరబోయేది ఎవరని ఒకరిద్దరు నాయకులు చంద్రబాబును అడిగారు. అయినా అప్పుడే తొందర ఎందుకు త్వరలోనే వాళ్లెవరో మీకే తెలుస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారట. ఫలితంగా ఇది హాట్ టాపికైంది.  టీ.టీడీపీ నేతలు మాత్రం తమ పార్టీలోకి రాబోయే నేతలు ఎవరనే అంశంపై చర్చ జరుపుతున్నారు. పార్టీ నేతలతో సంబంధం లేకుండా నేరుగా అమరావతికి వెళ్లి మరీ చంద్రబాబుతో వారు చర్చలు జరిపారనే ప్రచారం ఉంది. పార్టీలో చేరేంత వరకు వారి సంగతి బయట పెట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఏమైనా పార్టీ మారుతున్నారా లేక కీలకమైన నేతలు ఎవరైనా ఉన్నారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ సైతం తనకు సమాచారం లేదని చెప్పడంతో విస్తుబోవడం నేతల వంతు అయింది.  తెలంగాణలో కేసీఆర్ పాలన పై వ్యతిరేకత పెరుగుతోంది. రానున్న రోజుల్లో ఆ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కోనుంది. అందుకే టీడీపీ మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు పావులు కదుపుతోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11294
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
ttd
  Categories:
view more articles

About Article Author