ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం కోమటిరెడ్డి

ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం  కోమటిరెడ్డి
December 09 16:35 2017
 నల్గొండ,
సోనియాగాంధీ ని దేవత అని చెప్పిన కేసీఆర్ కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేని మూర్ఖుడిలా మారాడని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. శనివారం నాడు సోనియా గాంధీ జన్మదిన కార్యక్రమంలో అయన మాట్లాడారు.  తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీ, ఆమెకు 4 కోట్ల మంది రుణపడి వుంటారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని గెలిపించి సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని అయన అన్నారు. తెలంగాణ వచ్చి నాలుగేళ్లు అయినా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు.  ఓయూ లో విద్యార్థి ఆత్మహత్య కు కారణం కేసీఆరేనని అయన ఆరోపించారు. తెలంగాణకు చెందిన లక్షల కోట్ల ఆస్థులను ఆంధ్ర కాంట్రాక్టర్ల కు కట్టబెడుతున్నాడు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని అయన దుయ్యబట్టారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11314
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author