ఉద్యోగాల భర్తీకి బీజేపీ పోరాటం : లక్ష్మణ్

ఉద్యోగాల భర్తీకి బీజేపీ పోరాటం : లక్ష్మణ్
December 09 16:41 2017
 నల్గొండ,
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన లక్షా పదకొండు వేల ఉద్యోగాలు భర్తీ చేసేంత వరకు బిజెపి పోరాడుతుందని  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్పష్టం చేసారు. శనివారం నాడు అయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో డీఎస్సీ కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగుల సమస్య తీవ్రంగా ఉందని అయన అన్నారు. రాష్ట్ర విభజన తరువాత రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. కానీ మూడున్నర సంవత్సరాలలో టీఆరెస్ చేసింది ఏమి లేదని అయన విమర్శించారు. రాజకీయ భర్తీ మాత్రం నిరంతరం కొనసాగుతుంది. చలో అసెంబ్లీ, నిరుద్యోగ సమర భేరి కార్యక్రమాలు ఇంకా ఉదృతం చేస్తామని అయన హెచ్చరించారు. దళిత దర్బార్ పేరు మీద ఉద్యమాలు చేస్తామని అన్నారు.  గిరిజన తండాల గ్రామ పంచాయతీ లు ఏమైనవని అయన ప్రశ్నించారు. బీసీ కుల వృత్తుల మీద పోరాటం చేస్తాం.  పెండింగ్ ప్రాజెక్ట్ లు అన్ని వెంటనే పూర్తి చేయాలి. మహిళా శిశు సంక్షేమ శాఖ ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.  కాంగ్రెస్ పాలనలో ప్రజలకు న్యాయం జరగలేదు.  గిరిజన తండాలు అభివృద్ధికి నోచుకోలేదు. కేంద్ర పథకాలు ప్రజల్లోకి తీసుకె ళ్లాల్సిన అవసరం ఉందని లక్ష్మణ్ అన్నారు. దాంతోపాటు విద్యా వ్యవస్థ ను తెలంగాణ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.  లక్షా యాబై వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 24000 వేల కోట్లు రహదారుల అభివృద్ధికి కేంద్రం కేటాయించిందని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లలో పోలీసుల తీరు సరికాదని అయన విమర్శించారు. జనవరి లో నల్గొండ జిల్లా నుండి బీజేపీ లోకి చాలామంది నాయకులు చేరనున్నారు. కేసీఆర్ అవకాశ వాద రాజకీయాలకు ముగింపు పలుకుతామని అయన అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11317
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author