గ్రానైట్ కు గ్రహణం

గ్రానైట్ కు గ్రహణం
December 09 17:20 2017
విజయనగరం,
దేశవ్యాప్తంగా పేరున్నతాడిపత్రి గ్రానైట్ కు ఏమైంది. రాయలసీమలోనే ఒకప్పుడు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన తాడిపత్రిలో గ్రానైట్ కు గ్రహణం పెట్టిందా.. నాలుగు సంవత్సరల క్రితం వరకు పుట్టగొడుగుల్లా వెలసిన గ్రానైట్ పరిశ్రమలు ఇప్పుడెందుకు మూగబోయాయి. జెస్ట్ సీ దిస్ స్టోరీ. అనంతపురం… కడప రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన తాడిపత్రిలో నాలుగేళ్ళ క్రితం వరకు గ్రానైట్ పరిశ్రమలు పుట్టగొడుగుల్లా వెలుస్తూ వచ్చాయి. సిమెంటు తయారీకి అనువైన సున్నపురాయి, కడప నల్ల రతి బండలు, గ్రానైట్ నిక్షేపాలు కోకొల్లలుగా ఉన్నాయి. పారిశ్రామిక హబ్ గా దేశవ్యాప్తంగా పేరు పొందిన తాడిపత్రి, పరిసర ప్రాంతాల్లో నాలుగేళ్ల క్రితం వరకు గ్రానైట్ ప్రాసెసింగ్ పరిశ్రమలు 450కి పైగా ఉండేవి. నల్లరాతి పరిశ్రమలు 800 వరకు ఉండేవి. ఈ పరిశ్రమలపై ఆధారపడి ప్రత్యక్షంగా 20 వేలు, పరోక్షంగా 15 వేల కుటుంబాలు జీవనం సాగిస్తుండేవి. పరిశ్రమలు జోరుగా సాగె రోజుల్లో ఇక్కడి నుంచి దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలతో పాటు.. మలేషియా, సౌది, చైనా, శ్రీలంక తదితర 15 దేశాలకు గ్రానైట్ ను ఎగుమతి చేసేవారు. ఒక్కో కట్టర్ పై నెలకు 75 చొప్పున రూ.9 లక్షలు నుంచి 10 లక్షల వరకు యజమానులకు ఆదాయం ఉండేది. ప్రతి ఏటా రూ.100 కోట్లు టర్నోవర్ జరిగేది. తాడిపత్రి చుట్టుపక్కల వారికి పరిశ్రమలల్లో చేతినిండా పని ఉండేది.  ప్రస్తుతం ఈ పరిస్థితి కనిపించడం లేదు. ఇక్కడ పనిలేక  గ్రానైట్ర్ కూలీలు వలసలు వెళ్లటానికి సిద్ధమైనారు. ఇకనైనా గ్రానైట్ ఫ్యాక్టరీలకు ప్రభుత్వం నుంచి రాయతీలు ఇచ్చి ఫ్యాక్టరీలు తెరిపించాలని కోరుతున్నారు. గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంపై ప్రభుత్వం స్పందించి ఎగుమతులకు మార్గం ఏర్పాటు చేయాలని, రోజూవారీ కూలీలకు పని ఉండేలా చూడాలని కూలీలతో పాటు, స్థానికులు కోరుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11337
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author