అగ్నిప్రమాదంలో కాలిన మిషన్ భగీరథ పైపులు

అగ్నిప్రమాదంలో కాలిన మిషన్ భగీరథ పైపులు
December 09 18:33 2017
ఆదిలాబాద్ అర్బన్,
అకస్మాత్తుగా సంభవించిన అగ్ని ప్రమాదంతో మిషన్ భగీరథ పైపులు కాలిపోయాయి. శనివారం ఆదిలాబాద్ లోని  ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక గల ఖాళీస్థలంలో ఉంచిన పైపులకు ఒక్కసారిగా నిప్పంటుకుంది. మంటలు చెలరేగటంతో సమీపంలో భోజనం చేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది గమనించి అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాగా ఎల్ఎన్టీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై ఆరా తీస్తున్నారు. నష్టం అంచనా విలువ నిర్థారణ చేయాల్సి ఉంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11369
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author