ఏలూరులో ఫేమస్ అవుతున్న బుద్ధా పార్కు

ఏలూరులో ఫేమస్ అవుతున్న బుద్ధా పార్కు
December 11 13:53 2017
ఏలూరు,
మనస్సుంటే మార్గముంటుంది. చెయ్యాలన్న తపన ఉంటే మురికి కూపాన్ని కూడా సుందరవనం తీర్చిదిద్దొచ్చని నిరూపించారు పశ్చిమగోదావరి జిల్లా అధికారులు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో గజ్జలవారి చెరువుకి ఒకప్పుడు చాలా ప్రాధాన్యత ఉండేది. చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలు ఈ చెరువులో నీళ్లు త్రాగేవారు. అయితే కొన్ని సంవత్సరాలుగా ఆ చెరువు నిరాధరణకు గురికావడమే గాక పక్కన ఉన్న చేపల మార్కెట్ లో మిగిలిపోయిన వ్యర్ధాలను ఆ చెరువులో వేసేవాళ్ళు. అలా రాను రానూ ఆచెరువు మురికి కూపంగా మారి దుర్భరభరితమైన వాసనలు రావడంతో ఆ ప్రాంతానికి వెళ్లాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితులు ఉండేవి. అయితే 2012-2013 సంవత్సరాలలో జిల్లా కలెక్టర్ గా పనిచేసిన వాణి మోహన్ ఆ గజ్జలవారి చెరువు ప్రాముఖ్యతను గుర్తించి మురికి కూపంగా ఉన్న దానిని సుందర వనంగా మార్చారు.కలకలలాడే చెరువుగా దాన్ని మార్చడమే గాక హుస్సేన్ సాగర్ లో ఉన్న 72 అడుగుల బుద్ధని విగ్రహం కంటే 4 అడుగులు ఎత్తైన 76 అడుగుల ఎత్తుగల విగ్రహాన్ని చెరువు మద్యలో ఏర్పాటు చేసి ఒక పార్కులాగా తయారుచేసి దానిని బుద్దా పార్కుగా నామకరణం చేసారు. ఈ పార్కును రంగులహంగులతో తీర్చిదిద్దటంతో మంచి శోభను సంతరించుకొంది. తనువు తీరిన ఈ అందాలను కళ్లారా కాసేపు చూస్తుంటే ఇక్కడే ఉండాలని అన్పిస్తోంది ఎవ్వరికైనాసరే. ఎప్పుడు చూసినా క్షణం తీరిక లేకుండా ఉండే ఏలూరు నగరవాసులకు సాయంత్రం పూట కాస్త్ర సేద తీర్చుకొనేందుకు వెలితే అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ బుద్దపార్కు పర్యాటకులకు కాస్త్ర ఉపశమనాన్ని కలుగజేస్తోందంటున్నారు ప్రకృతి ప్రేమికులు.నవ్యాంద్ర రాజధాని నిర్మాణంలో అమరావతిలో బుద్ధవిగ్రహాన్ని భారీఎత్తున నిర్మించనున్న నేపథ్యంలో ఇప్సుడు ఏలూరులోనున్న బుద్దపార్కుకు ఎంతగానో ప్రాముఖ్యత ఏర్పడింది. దీంతో పగలంతా నిత్య రద్దీగా ఉండే ఏలూరు నగర వాసులు కాస్త్రా సాయంత్రం సేదతీర్చుకొనేందుకు ఈబుద్దపార్కును సందర్శిస్తే ఎంత హాయిగా ఉందంటూ రిలాక్స్ అవుతున్నారు. ఈ బుద్దపార్కుకి చుట్టుప్రక్కల నీటితోనింపటంతో దాంట్లో బోటు షికారు చేస్తున్నారు పర్యాటకులు. ఈ బుద్దపార్కుచుట్టూ పర్యాటకులు సాయంత్రం పూట సేద తీర్చుకొనేందుకు వస్తున్నారు. దీంతో ఏలూరులోని బుద్ధాపార్కు అందరిదృష్టిని ఆకర్షిస్తుంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11461
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author