రబీపైనే రైతుల ఆశలు

రబీపైనే రైతుల ఆశలు
December 11 14:35 2017
మహబూబ్ నగర్,
మహబూబ్ నగర్ జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడులు మాత్రం రైతన్న లు ఆశించిన మేర పొందలేకపోయ్యారు. ఖరీఫ్ సీజన్ మొదట్లో ఆశిం చిన మేర వర్షాలు కురవకపోవడంతోపాటు చివరి నెలలో మాత్రం ఆ శజనకంగా వర్షాలు కురవడంతో రైతన్నలు రబీపై ఆశలు పెంచుకు న్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో రబీ సాధారణసాగు విస్తీర్ణం 61 975 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు జిల్లాలో 25648 హెక్టార్లలో రైత న్నలు పంటలను సాగు చేశారు. జిల్లాలో రబీ సీజన్‌లో ప్రధాన పంట లైన వేరుశనగ,వరి,జొన్న పంటలు కూడా ఈ సారి ఆశించిన మేర సాగు కాలేకపోయింది. దీంతో జిల్లాలో రబీ సాగు అంతంత మాత్రం గానే ముందుకు సాగుతోంది.జిల్లాలో రబీ సీజన్‌లో ప్రధానంగా వరి,వేరు శనగ,జొన్న పంటలను సాగు చేస్తుంటారు. కాగా జిల్లాలో వేరుశనగ పంట సాధారణ సాగు విస్తీర్ణం28680హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 21612 హెక్టార్లకు మాత్రమే పరిమితమైంది. జిల్లాలో రబీ సీజన్‌లో గతంలో ఎప్పుడు లేనంతగా ఈ ఏడాది వేరుశనగ సాగు విస్తీర్ణం తగ్గి పోయింది. అంతే కాకుండా జొన్నసాగు విస్తీర్ణం 3003 హెక్టార్లు కాగా 1563 హెక్టార్ల లో రైతులు సాగు చేశారు. అలాగే మొక్కజొన్న, రాగి,శనగ,పొద్దు తిరు గుడు పంటల సాగు విస్తీర్ణం అమాంతం తగ్గిపోయింది. ఇలా ఈ ఏడాది రబీ సాగు రైతులు ఆశించిన మేర ముందుకు సాగడం లేదు.జిల్లా రైతులు రబీలో వరి పంటసాగును ప్రధానంగా పండిస్తుంటారు. జిల్లా వరి సాగు విసీర్ణం 23722 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు రైతులు 1000హెక్టార్లలో సాగు చేశారు. ఈ ఏడాది వర్షకాలం చివరి నెలలో వర్షాలు ఆశజనకంగా కురవడంతోపాటు జిల్లాలో చెరువులు నిండి భూగర్బజల మట్టాలు ఆమాంతం పెరిగా యి. అంతేకాకుండా ఎగువన కురిసిన వర్షాలకు జూరాల ప్రాజెక్ట్ నిండడంతోపాటు ఎత్తిపోతల ద్వారా కోయిల్‌సాగర్ ప్రాజెక్ట్‌ను నింపే సింది. దీంతో ఈ రబీ సీజన్‌లో వరి సాగుకు కోయిల్‌సాగర్ ద్వారా నీటిని వదిలేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో బోర్లలో భూగర్బజల మట్టం పెరగడం తోపాటు ప్రాజెక్ట్‌లోకి నీరు వచ్చి చేర డంతో జిల్లాలో రబీ సాగు పెరిగే అవకాశం ఉంది.జిల్లాలో రబీ సాగుకు కావాల్సిన ఏర్పాట్లను చేయడంలో వ్యవసాయాధికారులు బిజిబిజిగా మారారు. రబీకి కావాల్సిన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేం దు కు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే సిద్ధ్దం చేశారు. రబీకి కావాల్సిన వేరుశనగ సబ్సిడీ విత్తనా లను ఇప్పటికే పంపిణీ చేయాగా కావాల్సిన సబ్సిడీ వరి విత్తనాలను ఏజెన్సీల ద్వారా అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా జిల్లాకు కావాల్సిన యూరియా,డిఏపీ తది తర ఎరువులను అందుబాటులో ఉంచారు. జిల్లాలో రబీ వరి సాగు విస్తీర్ణం సా ధారణ సాగు విస్తీర్ణం కంటే ఎక్కువ మొత్తంలో సాగయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తు న్నారు. వ్యవసాయ పంపుసెట్లకు గతంలో ఉన్న 9గంటల విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం 2018 జనవరి 01వ తేది నుంచి 24గంటల విద్యు త్‌ను అందించేందుకు సిద్దం అవు తోంది. అందుకు కావాల్సిన ఏర్పా ట్లపై ఇప్పటికే విద్యుత్‌శాఖ అధికారులతో సమీక్షించడంతోపాటు గత నెలలో ప్రయోగాత్మకంగా 24 గంటల విద్యుత్ పంపిణీని పరీక్షిం చింది. దీంతో వచ్చే ఏడాది జనవరి 01 నుంచి వ్యవసాయ పంపు సెట్లకు 24గంటల విద్యుత్‌ను అందిం చేందుకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సూత్రప్రాయంగా అంగీకరించారు. దీంతో ఈ ఏటా సాదారణసాగుకు మించి సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11485
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author