రేణిగుంట ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ కు కేంద్ర ఆమోదం

రేణిగుంట ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ కు కేంద్ర ఆమోదం
December 11 15:54 2017
చిత్తూరు,
రేణిగుంట లోని శ్రీ వెంకటేశ్వర మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్ కు కేంద్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ ఆమోదం తెలిపింది. 2015 లో రేణిగుంట ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 113.27 ఎకరాల్లో మౌలిక వసతులతో రేణిగుంట ఈఎంసి ఏర్పాటు చేస్తున్నారు. సెల్ కాన్, కార్బన్,లావా మూడు ప్రధాన మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు బాగస్వామ్యులు గా క్లస్టర్ ఏర్పాటు అవుతోంది. సెల్ కాన్, డిక్సన్  సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించగా కార్బన్ కంపేనీ త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించనుంది.  పూర్తి స్థాయి సామర్థ్యం వినియోగంలోకి వస్తే ఒక్క రేణిగుంట ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా దాదాపు 50 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం వుందని అధికారులు అంటున్నారు.
రేణిగుంట ఈఎంసి క్లస్టర్ కు ఆమోదం తెలిపినందుకు మంత్రి నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వం,  కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ కి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని మొబైల్,ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి హబ్ గా తయారు చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి అనుకూలంగా ఉండేలా పూర్తి స్థాయి మౌలిక వసతులు కల్పిస్తున్నామని అయన అన్నారు. మొబైల్ తయారీ లో బ్యాటరీ తయారీ నుండి అన్ని రకాల విడిభాగాలు మన రాష్ట్రంలో తయారు అయ్యేందుకు అవసరం అయిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ప్రస్తుతం దేశంలో తయారు అయ్యే 10 ఫోన్లలో 2 మన రాష్ట్రంలో తయారు అవుతున్నాయి. 2019 కి దేశంలో తయారు అయ్యే 10 ఫోన్లలో 5 మన రాష్ట్రంలో తయారు అయ్యేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నామని లోకేష్ తెలిపారు. త్వరలోనే అనంతపురం లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు కు చర్యలు తీసుకుంటున్నామని అయన వెల్లడించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11510
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author