మలుపు తిరిగిన రసాయన దాడి కేసు

మలుపు తిరిగిన రసాయన దాడి కేసు
December 11 16:04 2017
నాగర్ కర్నూలు,
నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో గత 27న జరిగిన రసాయన(యాసిడ్ కాదు) దాడి కేసు కీలక మలుపు తిరిగింది. ఓ మహిళ తన భర్త స్థానంలో మరోవ్యక్తిని చిత్రీకరించింది. అతనే భర్తగా నమ్మించడానికి పక్కా వ్యూహంతో దాడి చేయించింది. చివరికి కుటుంబ సభ్యులు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది మహిళ భర్త కాదని, మరోవ్యక్తి అని గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. తెలకపల్లి మండలంలోని బండపల్లికి చెందిన స్వాతి, సుధాకర్రెడ్డి భార్యాభర్తలు. వీరు కొంతకాలంగా నాగర్కర్నూల్లో నివాసముంటున్నారు. గత 27న వీరు నివాసముంటున్న ఇంట్లో రసాయన దాడి జరిగింది. అనంతరం ఎవరికీ చెప్పకుండా దాడికి గురైన వ్యక్తిని స్వాతి చికిత్స కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించింది. గుర్తుతెలియని వ్యక్తులు తన భర్త సుధాకర్రెడ్డిపై యాసిడ్ దాడి చేశారంటూ స్వాతి ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలోని ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న వ్యక్తి వద్దకు పోలీసులు వెళ్లి వివరాలను సేకరించారు. సుధాకర్రెడ్డి కుటుంబసభ్యులూ హైదరాబాద్లో చికిత్స పొందుతున్న వ్యక్తిని చూసి వచ్చారు. చికిత్స పొందుతున్నది సుధాకర్రెడ్డి కాదంటూ అతని అన్న సురేందర్రెడ్డి, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను నాగర్కర్నూల్లో నివాసముంటున్న రాజేశ్ అని పోలీసులు వేలిముద్రల ఆధారంగా గుర్తించారు. వాస్తవానికి ఇంట్లో  నిద్రిస్తున్న సుధాకర్ మెడకు మత్తు ఇంజక్షన్ ను ఇచ్చిన రాజేష్, తలపై ఇనుప రాడ్డుతో కొట్టి చంపారని, ఆపై శవాన్ని తీసుకెళ్లి దహనం చేసి, యాసిడ్ దాడి నాటకం మొదలు పెట్టారని పోలీసులు నిర్దారించారు.  ఓ సీరియల్ లో చూపించిన విధంగా ప్లాస్టిక్ సర్జరీతో తన భర్త రూపురేఖలు మార్చాలన్న స్వాతి ఆలోచన ఆమెను ఈ పని చేసేందుకు ప్రోత్సహించిందని అన్నారు. స్వాతిని రెండు రోజుల క్రితం ఆరెస్టు చేసిన పోలీసులు, రాజేష్ ను ఆసుపత్రిలో అదుపులోకి తీసుకున్నారు.
స్వాతి, సుధాకర్ ల పిల్లల భవిష్యత్తును తానే చూసుకుంటానని స్వాతి సోదరుడు జైపాల్ అన్నాడు. కాగా, ఈ మధ్యాహ్నం సుధాకర్ అవశేషాలకు నాగర్ కర్నూలులో అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన బంధువులు స్వాతిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆమెను జైలుకు పంపకుండా తమ వద్ద వదిలివేయాలని, తామే తగిన శిక్ష విధిస్తామని డిమాండ్ చేశారు. కాగా, సోమవారం నాడు  స్వాతిని కోర్టు ముందు హాజరు పరచారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11516
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author