మమ్మీల సంస్కృతికి స్వస్తి పలకండి

మమ్మీల సంస్కృతికి స్వస్తి పలకండి
December 11 16:10 2017
భువనగిరి యాదాద్రి,
భాషకు సంస్కృతికి అవినాబావ సంబంధం ఉంది. ఒకదానితో ఒకటి విడదీసి చూడలేమని మంత్రి  మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం నాడు జిల్లా కేంద్రంలో జరిగిన ప్రపంచ తెలుగు మహసభలకు అయన హజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ మన సంస్కృతిని కాపాడేది మన భాషేనని అన్నారు. అమెరికాకు సంస్కృతి లేకపోవడానికి ఆ దేశానికి భాష లేక పోవడమే. ఎన్నో భాషలు పుట్టినా కాలగర్భంలో అంతర్ధానమయ్యాయి. వాటంతట అవి అంతర్ధానం కాలేదు.విభిన్న జాతులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నందునే భాషలు మాయమయ్యాయని అన్నారు. భాష బతికిఉంటే ఆ భాషతో కూడిన  సంస్కృతితో తిరగబడతారన్న కోణంలోనే భాషను మాయం చేశారని మంత్రి అన్నారు.
ప్రపంచంలో కొన్ని జాతులు నిలబడ్డాయి అంటే భాష సంస్కృతిల పునాదుల మీదనే. భాష పేరుతో తెలుగు రాష్ట్రాలను ఏకం చేసిన వారు కాలక్రమంలో తెలంగాణ పదం ఉచ్ఛారణకు పనికి రాదు పొమ్మన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సచివాలయంలో అడుగు పెట్టాలంటే మన యాస పనికి రాదన్న భావన కల్పించారని అయన అన్నారు. భాష ఒక అవసరంగా పుట్టింది. భాష బావాన్ని తెలియ చెప్పే సాధనం ఎంత మాత్రం కాదు. భాష పట్ల దురభిమానం కూడదు. ఇంకో భాషకు వ్యతిరెకంగా ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. పర భాష మోజును విడనాడండి. మమ్మీల సంస్కృతికి స్వస్తి పలకండని మంత్రి పిలుపునిచ్చారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11519
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author