యుద్ధప్రాతిపదికన పోలవరం

యుద్ధప్రాతిపదికన పోలవరం
December 11 21:13 2017
న్యూఢిల్లీ
పోలవరం జాతీయ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని కేంద్ర జలవనరుల శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసే 2018లోగా ప్రాజెక్టును పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 22న పోలవరం సందర్శిస్తానని ఆ తర్వాత పూర్తి స్థాయిలో సమీక్ష జరుపుతానని పేర్కొన్నారు. ఏ ఒక్క బిల్లు మా దగ్గర పెండింగ్ ఉండదని, ఎప్పటికప్పుడు చెల్లింపులు జరపాలని అధికారులను ఆదేశించామన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొన్నాళ్లుగా వైరుధ్యాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం సహకరించకుంటే ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను వారికే వదిలేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రతి 15 రోజులకు ఒకసారి పోలవరం సందర్శించి ప్రాజెక్టు పనులు సమీక్షిస్తానని నితిన్‌ గడ్కరీ అన్నారు. అందులో భాగంగానే ఆయన రాష్ట్రానికి రానున్నారు.
కాగా ఆంధ్రపదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష నిర్వహిస్తున్న చంద్రబాబు ఈరోజు ప్రాజెక్టును సందర్శించారు. విహంగ వీక్షణం ద్వారా కాపర్‌ డ్యామ్‌, డయాఫ్రం వాల్‌ పనులను పరిశీలించారు. పనుల తీరును ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడు ముంపు మండలాలు రాకపోతే పోలవరం మన వూహకు కూడా అందేది కాదు. కాంక్రీటు పనుల వేగవంతానికి చర్యలు తీసుకుంటున్నాం. కాపర్‌ డ్యామ్‌ నిర్మాణం పూర్తయితే గ్రావిటీ ద్వారా నీరందిస్తామనిఅన్నారు.
కాంక్రీట్ పనులు చేయగలిగితే అన్నీ సాధ్యమవుతాయన్నారు. కాంక్రీట్ పనులు తప్ప మిగిలినవన్నీ వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాంక్రీట్ పనులు 2,3 నెలలు ఆలస్యమయ్యాయన్నారు.. పునరావాస ప్యాకేజీ వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.54వేల కోట్లకు చేరుకుంది. పోలవరం ప్రాజెక్టుపై ప్రతిపక్షం అపోహలు సృష్టించి అడ్డుకోవాలని చూస్తోంది.ప్రతి సోమవారం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందిస్తున్నాం. రోజువారీ లెక్కలు చెబుతుంటే మళ్లీ శ్వేతపత్రం ఏమిటి?. ప్రాజెక్టును అడ్డుకోవద్దని విపక్షాలను కోరుతున్నా. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి రాజీ పడబోం. అడ్డుకుంటే చూస్తూ వూరుకోమని హెచ్చరించారు. ప్రజల మనోభావాలు దెబ్బతీస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు భావితరాలకు భద్రత అని గుర్తు చేశారు. రాయలసీమకు పట్టిసీమ నీళ్లు ఎలా వస్తాయని.. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించా
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11549
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author